Union Budget 2024: కేంద్ర బడ్జెట్ పై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం అని అన్నారు. రూ. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని చెప్పారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ (Telangana) ప్రస్తావన లేకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అని అన్నారు.
పూర్తిగా చదవండి..MLA KTR: 8 మంది ఉన్నా ఇచ్చింది గుండు సున్నానే: కేటీఆర్ ఫైర్
తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని అన్నారు కేటీఆర్. 16 మందిని పార్లమెంట్‌కు పంపిస్తే ఒకరు కూడా బడ్జెట్‌పై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు.
Translate this News: