/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-12-7.jpg)
MLA KTR: తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు బెస్ట్ విషెస్ చెప్పారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్. వారికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈసారి పర్యటనలో తెలంగాణకు పెట్టుబడులతో రావాలని అన్నారు. కేసీఆర్ హయంలో గత 10 ఏళ్లలో రాష్ట్రానికి 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగాల్లో 24 లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు.
As a large contingent from the Telangana Government travels to the US and South Korea to attract investments, I want to take a moment to wish @revanth_anumula and @Min_Sridhar_Babu gaaru - “All the Best”
I came across the schedule reported by some media outlets and I'm pleased…
— KTR (@KTRBRS) August 4, 2024
రేవంత్ కు ఘనస్వాగతం..
తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడేలా పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైంది. న్యూయార్క్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం లభించింది. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోనూ వారు పర్యటిస్తారు. కీలకమైన న్యూయర్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నానని రేవంత్ అన్నారు.