/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bandla-Krishna-Mohan-Reddy.jpg)
BRS MLA Krishnamohan Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగేస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది కాంగ్రెస్. తాజాగా మరో ఎమ్మెల్యేను చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చింది. మరో ఎమ్మెల్యేను చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. సీఎం రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపదాస్ మున్షీ సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి, కేసీఆర్ కు బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.