Harish Rao: ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జోస్యం చెప్పారు. ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు.

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు.. హరీష్ రావు ఫైర్
New Update

తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యమని బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు అని అన్నారు.

తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై.. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని ఆశిస్తున్నామన్నారు.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe