సర్పంచ్‌ పదవీ కాలం పొడిగించాలి.. మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌

సర్పంచ్‌ల పదవీకాలం గడవు పొడిగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నియోజక వర్గ పరిధిలోని సర్పంచులు, ఉప సర్పంచ్‌లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

New Update
సర్పంచ్‌ పదవీ కాలం పొడిగించాలి.. మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌

Harish Rao: సర్పంచ్‌ల పదవీకాలం గడవు పొడిగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నియోజక వర్గ పరిధిలోని సర్పంచులు, ఉప సర్పంచ్‌లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తమ పదవీకాలంలో సర్పంచులు తనకు సహకరించిన తీరు మరచిపోలేనిదని హరీశ్ గుర్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: TSPSC: టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్‌.. వరుస నోటిఫికేషన్లు!

ఆత్మీయ సత్కారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పరిధిలో సాగు, తాగునీటి రంగాల్లో చరిత్రలో నిలిచిపోయేలా పనులు జరిగాయన్నారు. ఆ అద్భుత కార్యక్రమంలో భాగస్వాములు కావడం, గోదావరి జలాలకు స్వాగతం పలకడం ఎమ్మెల్యేగా తనకు, సర్పంచులకు అదృష్టకరమైన విషయమన్నారు. అందరి సమష్టి సహకారంతో నియోజకవర్గాన్ని ఐదేళ్లలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపామన్నారు.

ఇది కూడా చదవండి: తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌పై కారులొ మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్

నియోజకవర్గంలోని గ్రామాలకు జాతీయ స్థాయి వరకూ 47 అవార్డులు రావడం సర్పంచ్‌ల పనితీరుకు నిదర్శనమన్నారు. కోవిడ్ విపత్తు సమయంలో సర్పంచ్‌లు ప్రజలకు అండగా ఉన్న తీరు అభినందనీయమన్నారు. క్షేత్రస్థాయిలో వారి కృషి ఫలితంగానే కష్టకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగామన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో డీఈవో శ్రీనివాసరెడ్డి, నోడల్ ఆఫీసర్‌ రామస్వామి, ఎంఈవోలతో పదో తరగతి పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ, ఎంపీపీలు కూర మాణిక్య రెడ్డి, ఒగ్గు బాలకృష్ణ యాదవ్, జెడ్పీటీసీ ఉమ, అర్బన్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కమలాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి రవీందర్ రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు