BRS MLA: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే!

TG: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సిద్దమైనట్లు తెలుస్తోంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జానారెడ్డితో భేటీ అయ్యారు. త్వరలో సీఎం రేవంత్‌తో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరేందుకే ఆ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారనే చర్చ మొదలైంది.

New Update
BRS MLA: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే!

Bandari Lakshma Reddy:బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుందా? అంటే దానికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టింది. కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను లాగేందుకు వ్యూహాలు రచిస్తోంది. జానారెడ్డిని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు. జానారెడ్డి బర్త్‌ డే సందర్భంగా ఆయన్ని కలిశారు. త్వరలోనే సీఎం రేవంత్‌తో బండారి లక్ష్మారెడ్డి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పదవి ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ఉప్పల్‌ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన బండారి లక్ష్మారెడ్డి గెలిచారు. దాదాపు 50 వేల మెజార్టీతో ఉప్పల్‌ నుంచి లక్ష్మారెడ్డి గెలిచారు. మరి ఆయన పార్టీ మారుతారో లేదో వేచి చూడాలి.

కాంగ్రెస్ లో చేరిన పోచారం..

మాజీ సీఎం కేసీఆర్ (KCR) కు బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత బీఆర్ఎస్ (BRS) ను వీడారు. మాజీ  స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) కేసీఆర్ కు గుడ్ బై చెప్పారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంజారాహిల్స్ లోని పోచారం నివాసానికి వెళ్లారు. ఆయనను కాంగ్రెస్ (Congress) పార్టీలోకి ఆహ్వానించారు. స్వయంగా సీఎం రేవంత్ ఆహ్వానించడంతో పార్టీ మారేందుకు పోచారం శ్రీనివాస్ సిద్ధమయ్యారు. తాజాగా ఆయన కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పోచారంకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరారు.

Advertisment
తాజా కథనాలు