BRS Malla Reddy: డొక్కు సైకిల్ మల్లారెడ్డి.. వందల కోట్లు ఎలా సంపాదించాడు?

సైకిల్‌పై పాలమ్ముతూ ఇళ్లిళ్లు తిరిగిన మల్లారెడ్డి ఇప్పుడు వందల కోట్లకు అధిపతి. రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్న ఆయన బయోగ్రఫీ ఎంటీ? వందల ఎకరాల భూములు ఆక్రమించారని అతడిపై ఆరోపణలు ఎందుకుస్తున్నాయి? పూర్తి వివరాలు తెలియాలంటే ఆర్టికల్ పై క్లిక్ చేయండి.

BRS Malla Reddy: డొక్కు సైకిల్ మల్లారెడ్డి.. వందల కోట్లు ఎలా సంపాదించాడు?
New Update

BRS Malla Reddy: ఒక సైకిల్‌..రెండు పశువులు..ఇవి ఆయనకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రధాన ఆస్తులు. ఒకనాడు ఇంటింటికి తిరిగి సైకిల్‌పై పాలమ్మిన ఆ వ్యక్తి..ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. హైదరాబాద్‌ గల్లీల్లో డొక్కు సైకిల్‌పై తిరిగిన ఓ సాధారణ వ్యక్తి...ఇవాళ మేడ్చల్ జిల్లాలో తనకంటూ ఓ సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నారు. అక్కడితో ఆగకుండా...పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి మంత్రి స్థాయికి ఎదిగారు. ఆయనెవరో కాదు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు వినని తెలియని వారుండరు. మరీ డొక్కు సైకిల్‌పై సొంతంగా ఇళ్లిళ్లు తిరిగిన మల్లారెడ్డి వందల కోట్లకు ఎలా ఎదిగారు. రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా ఎలా మారారు. వందల ఎకరాల భూముల ఆక్రమించారని ఆరోపణలు మల్లారెడ్డిపై ఎందుకున్నాయి. వాచ్‌ దిస్‌ స్టోరీ.

సాధారణ రైతు..
చామకూర మల్లారెడ్డి..1953 సెప్టెంబర్ 9న హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో జన్మించారు. విచిత్రంగా ఆయన తండ్రి పేరు, తాత పేరు కూడా మల్లారెడ్డినే. తల్లిపేరు మంగమ్మ. సాధారణ రైతు కుటుంబానికి చెందిన మల్లారెడ్డి ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటర్మీడియట్‌తోనే చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. 1972లో కల్పనా రెడ్డితో మల్లారెడ్డికి వివాహం జరిగింది. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత కూడా అంటే 1978 నుంచి 81 వరకు ఒక డొక్కు సైకిల్‌కు పాలక్యాన్స్‌ తగిలించుకుని ఇళ్లిళ్లు తిరిగి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు.


క్రమంగా విస్తరిస్తూ..
అలా సైకిల్‌తో మొదలైన మల్లారెడ్డి వ్యాపార ప్రస్థానం క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. బోర్‌వెల్స్‌ తర్వాత చిట్‌ఫండ్స్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు మల్లారెడ్డి. అక్కడితో ఆగలేదు. స్నేహితుల సలహాతో విద్యారంగంలోకి అడుగుపెట్టారు. అలా 1987లో ఓ స్కూల్‌ను ప్రారంభించిన మల్లారెడ్డి..వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలకు అధిపతి. 1995లో మల్లారెడ్డి గ్రూప్స్‌కు చెందిన ఓ స్కూల్‌ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అప్పటివరకు వ్యాపారవేత్తగా ఉన్న మల్లారెడ్డికి...రాజకీయంగా ఎదగాలన్న ఆశ పుట్టింది. అలా పుట్టిన ఆశ...ఆయనను 2014 మార్చి 19న తెలుగుదేశం పార్టీలో చేరేలా చేసింది. అంతే కాదు..మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ కూడా దక్కించుకున్నారు. అప్పటికే వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలకు ఆయన అధిపతి. దాదాపు 500కు పైగా ఎకరాల్లో తన విద్యా సంస్థలు ఉన్నాయని ఆయనే స్వయంగా చెప్తారంటే అతిశయోక్తి కాదు. 2014లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి..బీఆర్ఎస్‌లో చేరి మేడ్చల్‌ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రి హోదాను అనుభవించారు.

అనధికారికంగా వేల కోట్లు..
ఇటీవల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం మల్లారెడ్డి ఆస్తులు దాదాపు రూ.100 కోట్లు. ఇది కేవలం పేపర్ మీద రాసిన లెక్కలు మాత్రమే. కానీ అనధికారికంగా ఆయన ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంటుందని సమాచారం. ఆయన ఆస్తులు హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన సూరారం, దూలపల్లి, అలియాబాద్, జీడిమెట్ల, యాడారం, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.

కబ్జా ఆరోపణలు..
ఇవన్ని ఒక ఎత్తు ఐతే మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు మరో ఎత్తు. మొదటినుంచి మల్లారెడ్డిపై అనేక భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. చేగుంటలో 47 ఎకరాల భూమి ఆక్రమించారని మల్లారెడ్డిపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దుండిగల్‌ పరిధిలోనూ 20 గుంటల భూమి ఆక్రమించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు భద్రారెడ్డిపై దుండిగల్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. గతంలో ఓ రియల్టర్‌ను బెదిరించిన మల్లారెడ్డి ఆడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 50 ఎకరాల వెంచర్ వేసి కేవలం సర్పంచ్ కి మాత్రమే మాములు ఇస్తే సరిపోతుందా.? ఎమ్యెల్యే, మంత్రి ఉన్నారని మర్చిపోయావా అంటూ మల్లారెడ్డి రియల్టర్‌ను ప్రశ్నించారు. తనకు, ఎమ్యెల్యేకి సెటిల్ మెంట్ చేసే వరకు వెంచర్ ఆపేయాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చారు మల్లారెడ్డి.

వీడియో వైరల్..
మంత్రిగా ఉన్న టైంలో ల్యాండ్ విషయంలో మాట్లాడుతూ కబ్జాదారులు, దొంగలు అంతా మన లీడర్లే అన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఆ వీడియోలో ఆయన ఏ నేత పేరు చెప్పలేదు. ఐతే తర్వాత ఆ మాటలు తాను అనలేదని ఖండించారు మల్లారెడ్డి. ఇప్పుడు కూడా భూ కబ్జా ఆరోపణల కారణంగానే మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి దుండిగల్‌లోని కాలేజీలను చెరువు భూమిని ఆక్రమించి కట్టారంటూ అధికారులు తాజాగా కూల్చివేశారు. మల్లారెడ్డి మెడికల్ వర్సిటీ కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారన్న ఆరోపణలున్నాయి.

#brs-malla-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe