కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల్లో హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సిగ్గు లేకుండా కాంగ్రెస్ నేతలు తప్పుడు హామీలు ఇచ్చారని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియోలు, వార్తల క్లిప్ లతో ట్వీట్ చేశారు. మోసపు హామీలతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని ఫైర్ అయ్యారు కేటీఆర్. కాంగ్రెస్ తప్పుడు హామీలతోనే తాము ఓడిపోయామన్నారు.
ఇది కూడా చదవండి: Kaleshwaram Project: కాళేశ్వరం స్కామ్ వెనుక మేఘా.. ఆ సంస్థపై ప్రభుత్వం సీబీఐ విచారణకు కోరాలి: రఘునందన్ రావు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు కేటీఆర్. డిసెంబర్9వ తేదీన నెరవేరుస్తామన్న హామీల సంగతి ఏమిటని ప్రశ్నించారు. రైతులకు, కౌలు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఏమైందన్నారు. రూ.2లక్షల వ్యవసాయ రుణమాఫీ ఏమైందన్నారు. రూ.4వేల ఆసరా ఫించను, రూ.500కే సిలిండర్ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.
ప్రతీ మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం ఏమైందన్నారు. తొలి కేబినెట్‌లో మెగా డీఎస్సీ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ హామీపై కూడా కేటీఆర్ ప్రశ్నించారు. 6 గ్యారంటీలపై చట్టబద్ధత తీసుకువస్తామన్న మాటలు ఏమయ్యాయయన్నారు. మీ హామీలు నకిలీనా? లేక మీ నేతలు నకిలీనా చెప్పాలని ప్రశ్నించారు.