/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Harish-Rao-1.jpg)
ఈ రోజు రైతు రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొడంగల్ లో సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది కూడా ఆయనేనన్నారు. నిరంతరంగా పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని అన్నారు. అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర తనదన్నారు. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చొంటే.. మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తనదన్నారు.
తనకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదన్నారు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు తన వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడనన్నారు. మరోసారి చెబుతున్నా, ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు (అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించాలన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి గారూ!
తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు.
👉కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.
👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన… pic.twitter.com/mghX3v2TES
— Harish Rao Thanneeru (@BRSHarish) July 18, 2024
అలా అయితే.. తాను రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు. ఈ రోజు రైతు రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామంటూ సవాల్ విసిరిన వారిని రాజీనామా చేయమని అడగమన్నారు. ఎందుకంటే వారు పారిపోతారని హరీశ్ రావుపై సెటైర్లు వేశారు.
Follow Us