/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Niranjan-Reddy-jpg.webp)
Niranjan Reddy: రుణమాఫీ అమలుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ ఆదాయం బావుందని ఏపీ సీఎం చంద్రబాబు కూడా చెప్పారని గుర్తు చేశారు. రైతుబంధుకు పట్టాదారు పాస్‌బుక్ ప్రామాణికత అని అన్నారు. ఐదెకరాలలోపు రైతులకైనా వెంటనే రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాస్‌బుక్ ప్రామాణికత అయినప్పుడు రైతు భరోసా ఎందుకివ్వరు అని ప్రశ్నించారు. రుణమాఫీ ఇచ్చిన రైతుకు రైతు భరోసా ఎందుకివ్వరని అన్నారు. రుణమాఫీ ఒకే విడతలో అమలు చేస్తామని గతంలో సీఎం చెప్పారని అన్నారు.