Breaking : నీకేం తక్కువ చేశా.. సాకులు చెప్పకు: కేకేపై కేసీఆర్ ఫైర్.!

ఎర్రవల్లిలో ఫాంహౌజ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు కేశవరావు. ఈనెల 30న కాంగ్రెస్ లోకి చేరుతానని చెప్పడంతో గులాబీ బాస్ సీరియస్ అయ్యారని సమాచారం. 10ఏళ్ళు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారట

Breaking : నీకేం తక్కువ చేశా.. సాకులు చెప్పకు: కేకేపై కేసీఆర్ ఫైర్.!
New Update

BRS chief KCR fire on KK: ఎర్రవల్లిలో ఫాంహౌజ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు కేశరావు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ పై వ్యతిరేకత గురించి కేసీఆర్ కు కేకే వివరించారు. లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడవ స్థానంలో ఉంటుందని కేసీఆర్ తో చెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం, కాళేశ్వరం ఇష్యూ, పార్టీ ఫిరాయింపులు వంటివన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణమంటూ కేకే..కేసీఆర్ కు వివరించారు. దీంతో కేకేను బుజ్జగించే ప్రయత్నం చేశారు కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుందని పార్టీలోనే ఉండాలని కోరినట్లు సమాచారం. అయినా కూడా కేకే పార్టీలో ఉండేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.

ఈనెల 30న కాంగ్రస్ పార్టీలో చేరుతానని కేసీఆర్ కు కేకే తేల్చి చెప్పారట. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారట. సాకులు చెప్పొదంటూ కేకేపై గులాబీ బాస్ సీరియస్ అయ్యారని సమాచారం. మీరు ఆలోచించే విధానం చాలా తప్పు అని..మరోసారి ఆలోచించుకోమని బీఆర్ఎస్ అధినేత కేకేకు తెలిపారట. పార్టీలో మీకేం తక్కువ చేశాను..రెండు సార్లు రాజ్యసభకు పంపించాను..పార్టీమెంటరీ పార్టీ నేతను చేశాను..కూతురుకు మేయర్ పదవి ఇచ్చాను..అయినా కూడా పార్టీ మారుతాననడం సమంజసం కాదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం.

ఇది కూడా చదవండి: హాట్ టాపిక్ గా మహరాష్ట్ర అమరావతి లోక్ సభ సీటు!

కేసీఆర్ తో పదేళ్లకు పైగా ప్రయాణం:
ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. అయితే.. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకే కు పార్టీ సెక్రటరీ జనరల్ గా అవకాశం కల్పించారు కేసీఆర్. అయితే.. కేకే జహీరాబాద్ (Zaheerabad) నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు.

కానీ.. వరుసగా పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఆయనకే దక్కింది. ఇంకా అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా ఆయనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కూడా అప్పగించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేకే మళ్లీ సొంతగూటికి చేరాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

#kcr #kk
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe