Bandi Sanjay:బీఆర్ఎస్ అభ్యర్థులు దండు పాళ్యం ముఠా..కేసీఆర్ క్యాన్సర్ కంటే డేంజర్: బండి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రాణాంతకమైన వ్యాధి క్యాన్సర్ కంటే కూడా డేంజర్ అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని బండి మండిపడ్డారు...

New Update
Bandi Sanjay: కాళేశ్వరంపై కాంగ్రెస్ డ్రామాలు.. కృష్ణ నీటిపై బీఆర్ఎస్ నాటకాలు: బండి సంజయ్

Bandi Sanjay:బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రాణాంతకమైన వ్యాధి క్యాన్సర్ కంటే కూడా డేంజర్ అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని బండి మండిపడ్డారు.

ఇక కేసీఆర్ రానున్న ఎన్నికల కోసం ప్రకటించిన అభ్యర్థులు దండు పాళ్యం ముఠా అని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు ఓడిస్తారని కేసీఆర్ కు ముందుగానే తెలిసిపోయిందని ఆయన అన్నారు. అయితే రెండు సార్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని నట్టేట ముంచిన బీఆర్ఎస్ కు ఓటేస్తారా లేక ప్రజల కోసం ఉద్యమాలు చేసిన జైళ్లకు పోతున్న బీజేపీ కి ఓటేసి గెలిపిస్తారా.. అని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఇక బీఆర్ఎస్ ప్రకటించిన లిస్ట్ లో ఉన్న వాళ్ళను పక్కనే పెట్టుకొని కేసీఆర్ చివర్లో సగం మందికి మాత్రమే టికెట్ ఇస్తారని బండి వ్యాఖ్యానించారు. అంతే కాదు కాంగ్రెస్ లో 30  మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆరే డబ్బులు ఇచ్చారని.. వాళ్లు గెలవగానే బీఆర్ఎస్ లోకి జంప్ అవుతారని బండి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మాట తప్పారని అన్నారు.

ఇక దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం, కేసీఆర్ ఫ్యామిలీకి 30 శాతం మొత్తం కలిపి కేసీఆర్ సర్కార్ 60 శాతం సర్కార్ గా మారిందని బండి సంజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన చేవెళ్ల అసెంబ్లీ నియోజక వర్గ పోలింగ్ బూత్ సమ్మేళనంలో చేశారు.

Advertisment
తాజా కథనాలు