'బ్రో' ప్రీరిలీజ్ ఈవెంట్.. జోరువానలోనూ తగ్గేదేలే అంటున్న పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ అభిమానులు జోరువానలోనూ బ్లాస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యాన్స్ ఈ వేడుకకు భారీగా హాజరయ్యారు. తమ అభిమాన హీరో పవన్‌ కల్యాణ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వాన కూడా లెక్కచేయకుండా తరలివచ్చారు.

New Update
'బ్రో' ప్రీరిలీజ్ ఈవెంట్.. జోరువానలోనూ తగ్గేదేలే అంటున్న పవన్ ఫ్యాన్స్

bro pre release event in hyderbad

పవన్ కోసం భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్.. 

మెగా హీరోలు పవన్ కల్యాణ్ - సాయితేజ్ హీరోలుగా నటించిన 'బ్రో' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలిసారిగా మామాఅల్లుళ్లు కలిసి నటించడంతో పాటు భీమ్లానాయక్ తర్వాత పవన్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల కానుంది. ఈలోపే హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పవన్ కల్యాణ్ ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.  దీంతో అక్కడి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

యూట్యూబ్‌లో అదరగొడుతోన్న ట్రైలర్..

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్స్, పోస్టర్స్, పాటలకూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అయితే ట్రెమెండస్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌కు 23 మిలియన్లకుపైగా రియల్ టైమ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. మరోవైపు యూట్యూబ్‌లోనూ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. టైమ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఇందులో పవన్.. దేవుడిగా కనిపించనున్నారు. గోపాలగోపాల మూవీలోనూ పవన్ దేవుడిగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మోడ్రన్ దేవుడి గెటప్‌లో కనువిందు చేయనున్నారు. ట్రైలర్‌లో పవన్ గెటప్స్ ఏవిధంగా ఉండనున్నాయో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

బాక్సాఫీస్ ఊచకోతకు సిద్ధం..

తమిళంలో సూపర్ హిట్ అయిన 'వినోదయ సితం' సినిమా రిమేక్‌గా ఇది తెరకెక్కింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రఖనినే దీనికి డైరెక్షన్ చేశారు. ఇక మాటల మాంత్రికుడు, టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే - సంభాషణలు అందించారు. ఇక మ్యూజిక్ సెన్సేషన్ థమన్ పాటతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. ఇప్పటికే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ కేతిక శర్మ, వింక్ భామ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్‌గా నటించారు. ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్థమైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు