పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో (Bro Movie). ఈ సినిమాకు మొదటి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. నంబర్ చూస్తే పెద్దదే అయినప్పటికీ.. పవన్ కల్యాణ్ స్టామినాను చాటే స్థాయిలో వసూళ్లు రాలేదు. ఆ ట్రెండ్ అలానే కంటిన్యూ అయింది. మొదటి వారం ముగిసేసరికి బ్రో సినిమా చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకున్నప్పటికీ, పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్టామినాకు తగ్గ వసూళ్లు మాత్రం కావివి.
మొదటి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వచ్చింది. జీఎస్టీతో కలిపి చూసుకుంటే, మొదటి రోజు షేర్ 22 కోట్ల 96 లక్షలు. ఇదేమంత పెద్ద ఎమౌంట్ కాదు. ఇంతకుముందు పవన్ నుంచి వచ్చిన భీమ్లానాయక్ సినిమా తొలి రోజు వసూళ్ల కంటే ఇది తక్కువే.
అలా 7 రోజులు పూర్తయ్యేసరికి బ్రో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 79 కోట్ల 75 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. షేర్ లెక్కల్లో చూసుకుంటే, 50 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో ఈ సినిమా 20 కోట్ల షేర్ మార్క్ అందుకుంది. లెక్కప్రకారం, 3-4 రోజుల్లో ఈ షేర్ వస్తుందని భావించినప్పటికీ వారం రోజులు పట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో బ్రో సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి (జీఎస్టీతో కలుపుకొని షేర్లు)
నైజాం - 19.76 కోట్లు
సీడెడ్ - 6.47 కోట్లు
ఉత్తరాంధ్ర - 6.55 కోట్లు
ఈస్ట్ - 4.61 కోట్లు
వెస్ట్ - 4.20 కోట్లు
గుంటూరు - 4.33 కోట్లు
కృష్ణా - 3.18 కోట్లు
నెల్లూరు - 1.61 కోట్లు
ఏపీ-నైజాం టోటల్ - 50.71 కోట్లు (గ్రాస్ - 79.75 కోట్లు)
Watch : కలెక్షన్స్ తగ్గడానికి అంబటి ప్లాన్ పనిచేసిందా ?
Also Read: బేబి మూవీ 3 వారాల వసూళ్లు