Telangana Elections 2023: కేంద్ర బలగాలను రప్పించండి.. ఇక్కడి వారిపై నమ్మకం లేదు: సీఈసీకి ప్రతిపక్షాల వినతి..!! తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడ్డ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు విరివిరిగా ఈసీతో భేటీ అవుతున్నారు. వారి డిమాండ్లను, వినతులను ఈసీ ముందు ఉంచుతున్నారు. కాగా అధికార బీఆర్ఎస్ పోలీసులు, ప్రభుత్వ విభాగాలను ప్రతి ఎన్నికల్లోనూ అనుకూలంగా పనిచేయించుకుంటుందని.. కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేస్తే...రాష్ట్రంలో ఉన్న యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని బీజేపీ ఈసీ ద్రుష్టికి తీసుకెళ్లింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సర్కార్ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తుందని...తమకు అనుకూలంగా వారిని వాడుకుంటుందని మర్రిశశిధర్ రెడ్డి ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి పోలీసుల మీద నమ్మకం లేదని..కేంద్ర బలగాలను ఇక్కడికి రప్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. By Bhoomi 04 Oct 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడ్డ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు విరివిరిగా ఈసీతో భేటీ అవుతున్నారు. వారి డిమాండ్లను, వినతులను ఈసీ ముందు ఉంచుతున్నారు. కాగా అధికార బీఆర్ఎసో పోలీసులు, ప్రభుత్వ విభాగాలను ప్రతి ఎన్నికల్లోనూ అనుకూలంగా పనిచేయించుకుంటుందని.. కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలోని అధికార యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని తెలిపింది. గత మునుగోడు ఉపఎన్నికలో వందల కోట్లు, మద్యం ఏరులై పారినా ఇక్కడిఅధికారులు, పోలీసులు పట్టించుకోలేదని ఈసీ ముందుకు తీసుకెళ్లారు. ఆ నియోజవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఈసీ ముందుకు తీసుకెళ్లినా పట్టించుకోలేదని..అలాంటిది 119 నియోజకవర్గాల్లో ఎలా కట్టడి చేయగలుగుతారంటూ పలు రాజకీయ పార్టీల నేతలు ప్రశ్నించారు. ఈ మేరకు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనల గురించి ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇది కూడా చదవండి: ఎన్నికల ఖర్చు పెంచండి.. ఆ గుర్తులు తొలగించండి: ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ డిమాండ్లు ఇవే..!! ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను ఎన్నికల విధులకు నియమించాలని ...దీనికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరారు. అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై అంచనా వేసేందుకు ఈసీ రాజీవ్ కుమార్ నేత్రుత్వంలో 17మంది కూడిన బృందం మంగళవారం హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. తాజ్ లో పలు పార్టీలకు చెందిన ప్రతినిధులో విరివిరిగా సమావేశం అయ్యారు. బీఆర్ఎస్ తరపున బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ తరపున ఉత్తమకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, బీజేపీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, టీడీపీ నుంచి కాసాని జ్నానేశ్వర్ , మజ్లిస్ నుంచి అసదుద్దీన్ ఓవైసీతోపాటు పలు పార్టీలకు చెందిన నేతలు సీఈసీతో భేటీ అయ్యారు. ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రిత్వ శాఖలో 67 పోస్టులకు నేటితో ముగియనున్న గడువు..వెంటనే అప్లయ్ చేసుకోండి..!! కాగా రాష్ట్రంలో ఓటరు జాబితాలో అక్రమాలు ఉన్నాయని తాము చేసిన ఫిర్యాదులపై స్పష్టత వచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డబ్బులు, అక్రమ మద్యం పంపిణీ, అడ్డుకోకపోతే ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగవన్నారు. కాగా ఇక్కడి యంత్రాంగంపై భరోసా లేదని కేంద్ర బలగాలను రప్పించాలని బీజేపీ నేత మర్రిశశిధర్ రెడ్డి ఈసీ ద్రుష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల అధికారులను ఎన్నికల విధులకు నియమించాలని కోరినట్లు స్పష్టం చేశారు. #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి