BREAKING: రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం కేసు... సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు/ఎమ్మెల్యేలపై ఎన్నికల నుంచి జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు హైకోర్టు ప్రధాన జడ్జిలు సుమోటోగా కేసును స్వీకరించాలని కోర్టు ఆదేశించింది.

BREAKING:  రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం కేసు... సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
New Update

తీవ్రమైన నేరం విషయంలో, ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు(Supreme court) చెప్పింది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. దోషిగా తేలిన ఎంపీ/ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు/ఎమ్మెల్యేలపై ఎన్నికల నుంచి జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్‌పై కోర్తు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ/ఎమ్మెల్యేలపై కేసుల సత్వర పరిష్కారానికి సంబంధించి ట్రయల్ కోర్టులకు ఒక యూనిఫామ్‌ గైడ్‌లైన్స్‌ ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎంపీలు/ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులను సమర్ధవంతంగా పర్యవేక్షించడం, పరిష్కరించడం కోసం సుమోటోగా కేసు నమోదు చేయాలని హైకోర్టులను సుప్రీంకోర్టు కోరింది.


నిషేధించలేమన్నారా?
నిజానికి గతంలోనూ ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. చట్టసభ సభ్యులను న్యాయవ్యవస్థ జీవితాంతం నిషేధించదని ఈ ఏడాది జులైలో విచారణ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దోషులుగా తేలిన చట్టసభ సభ్యులను జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టులు నిషేధించలేవన్నారు. ఈ కేసులో దాఖలైన పిటిషన్లను విచారించడానికి అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. చట్టసభలు ఆరేళ్లు అని చెప్పినప్పుడు జీవితకాల నిషేధాన్ని ఎలా చెప్పగలం? అని పిటిషనర్‌తో పాటు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ను కూడా ధర్మాసనం ప్రశ్నించింది.

కోర్టులు చేయవాల్సింది కాదు!
అటు ఈ కేసులో అమికస్ క్యూరీగా విజయ్ హన్సారియా వ్వవహరించారు. ఆయన కూడా పిటిషనర్‌ వాదనతో అంగీకరించారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులను కూడా సర్వీసుల నుంచి శాశ్వతంగా తొలగిస్తారన్నారు హన్సారియా. అయితే రాజకీయ నాయకుల విషయంలో మాత్రం అలా జరగడం లేదని కోర్టుకు తెలిపారు. ఆరేళ్ల పాటు నిషేధంతో సరిపెట్టేయటం సరికదాని సుప్రీం కోర్టుకు విజయ్ హన్సారియా చెప్పారు. అయితే ఈ కేసులో విచారణను హైకోర్టులు పర్యవేక్షించాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసులను త్వరితగతిన, ప్రభావవంతంగా పరిష్కరించేందుకు అవసరమైన ఆదేశాలు హైకోర్టు జారీ చేయవచ్చని తెలిపింది. దాఖలు చేసిన సంవత్సరం, పెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్ కేసుల సంఖ్య, విచారణల దశ గురించి జిల్లా వారీగా సమాచారాన్ని అందించే వెబ్‌సైట్‌లో హైకోర్టు ఒక స్వతంత్ర ట్యాబ్‌ను రూపొందించాలని చెప్పింది.

Also Read: కొంచెమైనా సిగ్గు ఉండాలి… పాక్‌ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన షమి..!

WATCH:

#supreme-court #banning-politicians
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe