బ్రేకింగ్: ప్రొఫెసర్ కోదండరామ్, ఆర్ఎస్పీ హౌస్ అరెస్ట్!

ప్రొఫెసర్ కోదండరామ్, ఆర్ఎస్పీ హౌస్ అరెస్ట్.. ఆయన ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు. ఇంట్లోనే ఉదయం పది గంటల నుంచి మౌన దీక్షకు దిగిన కోదండ రామ్.. బీఎస్పీ రాష్ట్ర ఆఫీస్ దగ్గర కూడా భారీగా మోహరించిన పోలీసులు. మరో వైపు ముందస్తుగా పోలీసులు ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో.. తన ఇంట్లోనే దీక్షను కొనసాగిస్తానని వెల్లడించిన ఆర్ ఎస్పీ...

బ్రేకింగ్: ప్రొఫెసర్ కోదండరామ్, ఆర్ఎస్పీ హౌస్ అరెస్ట్!
New Update

ఈ నెలాఖరులో టీఎస్పీఎస్సీ నిర్వహిస్తోన్న గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అఖిలపక్షం గన్ పార్క్ దగ్గర దీక్షకు పిలుపునిచ్చింది. ఈ  నేపథ్యంలో పోలీసులు అఖిలపక్షం నేతలను ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ జన సమితి చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

దీంతో ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో కోదండ రామ్ ఇంట్లోనే ఉదయం పది గంటల నుంచి మౌన దీక్షకు దిగారు. ఇక ఇలా ఉంటే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో బీఎస్పీ రాష్ట్ర ఆఫీస్ దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. మరో వైపు ముందస్తుగా పోలీసులు ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన కూడా తన ఇంట్లోనే దీక్షను కొనసాగిస్తానని వెల్లడించారు.

కాగా, ఈ నెల 29,30 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ను టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. దీంతో పేపర్ లీకేజీ వ్యవహారంలో విచారణ పూర్తి కాకముందే ఎగ్జామ్ ను నిర్వహించడం పట్ల అభ్యర్థులు నిరసనకు దిగారు. అదే విధంగా అఖిలపక్షం నేతలు కూడా ఈ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కోర్టు తీర్పుల కోసం ఎదురు చూస్తున్న టీఎస్పీఎస్సీ మరోవైపు గ్రూప్2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్ లను నిర్వహించడానికి ముమ్మర కసరత్తు చేస్తోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి