BREAKING: అఫ్ఘానిస్థాన్‌లో కూలిన విమానం! అఫ్ఘానిస్థాన్ బదక్షన్ ప్రావిన్స్‌లో కూలిపోయిన ప్రయాణీకుల విమానం భారతదేశానికి చెందినది కాదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇది భారతీయ ప్రయాణీకుల విమానమని అఫ్ఘాన్ స్థానిక మీడియా కోట్ చేసిన నివేదికను తిరస్కరించింది. By Trinath 21 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి An Indian passenger plane has crashed in Badakhshan’s mountainous areas, local officials said on Sunday: అఫ్ఘానిస్థాన్(Afghanistan) భారత్ విమానం కూలింది. బదక్షన్ ప్రావిన్స్‌లోని కురాన్-ముంజన్ జిబాక్ జిల్లాలతో పాటు టోప్‌ఖానా పర్వతాలలో భారతీయ ప్రయాణీకుల విమానం కూలిపోయిందని అఫ్ఘాన్‌కు చెందిన TOLO న్యూస్ నివేదించింది. ముందు రోజు రాత్రి రాడార్ నుంచి అదృశ్యమైన విమానం తోప్‌ఖానా ప్రాంతంలోని ఎత్తైన పర్వతాలలో కూలిపోయిందని బదక్షన్‌లోని తాలిబాన్ పోలీసు కమాండ్ పేర్కొంది. ఈ ప్రాంతం ప్రావిన్స్‌లోని జిబాక్ మరియు కెరాన్ ఓ ముంజన్ జిల్లాలను కలిగి ఉందని అఫ్ఘాన్‌కు చెందిన AMU TV నివేదించింది. ఇక వివరాలను ధృవీకరించడానికి భారత ప్రభుత్వం ముందుగా ఒక బృందాన్ని పంపింది. ప్రాణనష్టం ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. విమానం ప్యాసింజర్ క్యారియర్ అని చెప్పబడుతున్నప్పటికీ, ఈ సమయంలో అందులో ఉన్న ప్రయాణికుల సంఖ్య తెలియదు. Incorrect news across Afghan and other media. The plane that crashed was a Moroccan small aircraft, as confirmed by India’s Ministry of Civil Aviation below. Condolences to those lost in the mishap. pic.twitter.com/BTLgEVGOXk — Shiv Aroor (@ShivAroor) January 21, 2024 ఇంతలోనే ట్విస్ట్: మరోవైపు ఈ ఘటనపై భారత్ స్పందించింది. కుప్పకూలిన విమానం భారత్‌కు చెందినది కాదని చెందిన విమానం కాదని పౌర విమానయాన మంత్రిత్వ తెలిపింది. మొరాకో రిజిస్టర్ట్ DF10 విమానమని అధికారులు చెబుతున్నారు. అఫ్ఘానిస్థాన్ ప్రకటనను భారత్ కొట్టిపారేసింది. Also Read: వరుస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మతిపొగొడుతున్న కర్లీ భామ! WATCH: #afghanistan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి