హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం దంచికొట్టింది. పంజాగుట్ట, అమీర్ పేట్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, ముషీరాబాద్, కూకట్ పల్లి, లింగంపల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ,జూబ్లిహిల్స్, కోఠి, మోహిదీపట్నం, బేగంపేట్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్ తో పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
దీంతో హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. భారీ నుంచి అతి భారీగా రెండు గంటల పాటు వర్షం పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఇక జీహెచ్‌ఎంసీ అధికారులు నగరవాసులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరెంట్ స్తంభాల దగ్గర ఉండొద్దని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పారు.
అదే విధంగా నాలాలు పొంగి పొర్లే ప్రమాదం ఉండడంతో.. దాని పరిసరప్రాంతాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోడ్లపై వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని..చెట్ల కింద ఉండొద్దని.. అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. ఈ రెండు గంటల పాటు సురక్షితంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలన్నారు జీహెచ్ఎంసీ అధికారులు.
భారీ వర్షం! బయటకు రావొద్దు!
ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని, అనవసర ప్రయాణాలు చేయవద్దని డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్
సహాయక చర్యల కోసం 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. సముద్ర మట్టానికి 6 కిలోమీటర్ల ఎత్తున విస్తరించి ఉందని,
దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది వెల్లడించారు. ఇది మరింత బలపడి ఈ నెల 26 తేదిన వాయుగుండంగా మారే ఆవకాశం ఉందని, మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయణిస్తు దక్షణ ఓడిస్సా ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది దీని వల్ల రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి పేర్కొన్నారు.