Breaking:తెలంగాణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో శనివారం తెల్లవారు జామునే మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాగ్ పూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైల్లోని ఎస్ 2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక పాసింజర్స్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రైన్ ను నాగ్ పూర్ సమీపంలోనే ఆపివేసింది.
అయితే ఎస్ 2 బోగీలో చెలరేగిన మంటలు ఇతర బోగీలకు నెమ్మదిగా వ్యాపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు ఆపగానే ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ కొద్ది సేపటి వరకు తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఇక సమాచారం అందుకున్న రైల్వే సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని ఎస్ 2 బోగీలో చెలరేగిన మంటలను ఆపి వేశారు. అదే విధంగా ఇతర బోగీలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనకు కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. రైల్వే అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుసగా జరుగుతున్న రైల్ ప్రమాదాలతో రైల్వే శాఖ, ప్రయాణికులు ఉలిక్కి పడుతున్నారు. ఒడిశా రైలు ప్రమాదం మర్చిపోక ముందే తెలంగాణ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఇప్పుడు తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మళ్లీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.