Brain dead Woman Donated Organs: నేను చనిపోయి కూడా నలుగురిని బతికించాలనుకుంది ఆ యువతి. తన కుటుంబం పడుతున్న బాధ ఎవరికీ రాకూడదు అనుకుంది.. తమ బిడ్డ ఆశయాన్ని బతికించాలనుకున్న కుటుంబ సభ్యులు కూడా ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఘటన తిరుపతి (Tirupathi) జిల్లా పిచ్చాటూరు మండలం రామాపురంలో చోటు చేసుకుంది.
పిచ్చాటూరు మండలం రామాపురం హరిజనవాడ కు చెందిన సంపత్‌కుమార్ అమ్ములు దంపతుల కుమార్తె కీర్తి (20) స్థానిక ఓ ప్రైవేట్ కళాశాలలో బీకామ్ చేసి, చెన్నైలోని ఓ ప్రైవేట్ కాల్‌సెంటర్‌లో పని చేస్తుంది. రెండు రోజుల క్రితం ఆమె ఓ వివాహానికి హాజరయ్యేందుకు తన స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై చెన్నై సమీపంలోని కరడి పుత్తూరుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది
ప్రమాదానికి గురైన ఆమెను చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్ కి తరలించారు. అయితే కీర్తి బ్రెయిన్ డెడ్ కు గురైందని బ్రతికే అవకాశాలు దాదాపుగా లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. కీర్తి అవయవాలను దానం చేయాలని జీ హెచ్ ఆసుపత్రి డీన్ తెరని రాజన్ కీర్తి తల్లిదండ్రులను అభ్యర్థించారు.
కీర్తి మృతి చెందిన అనంతరం తమ బాధను మరచిపోయి తమ కుమార్తె ఏడు అవయవలను దానం చేశారు.బ్రెయిన్ డెడ్‌కు గురైన కీర్తికి నివాళులర్పిస్తూ చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది వాక్ ఆఫ్ హానర్ నిర్వహించారు.
బుధవారం ఉదయం కీర్తి స్వగ్రామం రామాపురంలో గ్రామస్థుల అశ్రునయనాలా మధ్య ఆమె అంతక్రియలను పూర్తి చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కీర్తి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Also Read: ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక.. ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని!