Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (RAM CHARAN) క్రియేటివ్ జీనియస్ (SHANKAR)శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.ఈ షెడ్యుల్ లో బ్రహ్మానందం స్పెషల్ అప్పియరెన్స్ పాత్ర చేస్తున్నట్లు తాజా అప్డేట్ బట్టి తెలుస్తోంది.ఈ మూవీ కోసం బ్రహ్మీ రెండు రోజులు కేటాయించారని సమాచారం.
చెర్రీ కి బ్రహ్మీ గిఫ్ట్
బ్రహ్మీ ఎక్కడుంటే అక్కడ సందడే. ఆయన సెట్లో ఉన్నారంటే ఎదో ప్రత్యేకత ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ రోజు గేమ్ చేంజర్ సెట్లో ప్రత్యేకతను సంతరించుకుంది.షూటింగ్ ప్యాకప్ చెప్పిన తరువాత రామ్ చరణ్‌కు బ్రహ్మానందం స్పెషల్‌గా గిఫ్ట్ గా ‘నేను’ (NENU)అనే పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం బ్రహ్మానందం ఆత్మకథ కావడం విశేషం.బ్రహ్మీ ఇచ్చిన గిఫ్ట్ కు చాలా హ్యాపీ ఫీల్ అయిన చరణ్ ఈ పుస్తకం గురించి తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ .ఈ పుస్తకంలో ఎన్నో జీవిత సత్యాలు, జీవితానికి సరిపడా పాఠాలు, నవ్వులు అన్నీ ఉన్నాయని చెప్పడం జరిగింది.ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.ఇక..ట్విట్టర్ లో చరణ్ షేర్ చేసిన ఫోటోల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. గేమ్ చేంజర్ మూవీలో ఎలక్షన్ ఆఫీసర్ కు సంభందించిన సన్నివేశాలు షూట్ చేస్తున్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఇటీవల ఈ పుస్తకాన్ని బ్రహ్మానందం మెగాస్టార్ చిరంజీవికి గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే.
మూడు విభిన్న పాత్రల్లో చెర్రీ
పక్కా పొలిటికల్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా వైడ్ గా అత్యంత భారీ బడ్జెట్ తో (DIL RAJU) దిల్ రాజు 50వ చిత్రంగా తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ పాత్ర మూడు జొన్లలో సాగుతుందని,కాలేజ్ స్టూడెంట్ గా,80-90 దశకంలో పొలిటికల్ లీడర్ గా,ఐఏఎస్ ఆఫీసర్ గా మూడు డిఫరెంట్ షేడ్స్ లో అలరించనున్నారని సమాచారం. ఈ మూవీలో చరణ్ కు జోడీగా కియరా అద్వానీ నటిస్తుండగా ఇప్పటికే ఈ కాంబినేషన్ కు సంభందించిన సన్నివేశాల చిత్రీకరణ , పాటలు సింహబాగం పూర్తి చేశారని సమాచారం.
విజయ దశమికి రిలీజ్ ?
ఇప్పటికే ఇండియన్ 2 ఫినిష్ చేసిన డైరెక్టర్ శంకర్ ఇక. పూర్తిగా ఈ గేమ్ చేంజర్ పైనే ఫోకస్ చేశారు. అత్యంత వేగంగా చిత్రాన్ని ఫినిష్ చేసి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అంటే విజయదశమి కి రిలీజ్ చేయబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ మూవీ ట్రాక్ లో ఉండగానే రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కబోయే మూవీ సైతం ట్రాక్ ఎక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:ప్రసాద్ మల్టీఫ్లెక్స్ లో గుంటూరు కారం ఒక రోజుకి 41 షోస్ తో అల్ టైం రికార్డు