Brahmamudi Serial: దుగ్గిరాల కుటుంబంలో చిచ్చు రేపిన ధాన్యలక్ష్మి.. బావ, మరదలి దెబ్బకు షాకైన రాజ్..?

కావ్య పై రాజ్ లోని ప్రేమను బయటపెట్టాలని ఫిక్స్ అవుతాడు కావ్య బావ భాస్కర్. కావాలనే రాజ్ ముందు కావ్యతో క్యారమ్స్ ఆడుతూ క్లోజ్ గా మూవ్ అవుతాడు. మరో వైపు ధాన్యలక్ష్మి మాటలకు భాధపడుతుంటారు సుభాష్. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: దుగ్గిరాల కుటుంబంలో చిచ్చు రేపిన ధాన్యలక్ష్మి.. బావ, మరదలి దెబ్బకు షాకైన రాజ్..?

Brahmamudi Serial: తమ్ముడి భార్య ధాన్యలక్ష్మి అన్న మాటలను గుర్తుచేసుకొని ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. అన్నయ్య బాధపడుతున్నాడని గమనించిన ప్రకాశం.. భార్య తరుపున సుభాష్ కు క్షమాపణలు చెప్తాడు. దీంతో సుభాష్.. నా తమ్ముడే కదా ఎలా తిట్టినా చెల్లుబాటు అవుతుందని అనుకున్నాను.. కానీ నీకు కూడా మనసు ఉందని ఈ రోజే అర్థమైంది. నన్ను క్షమించు తమ్ముడు అని అంటాడు. మనిద్దరి మధ్య క్షమాపణలు ఉండకూడదు అన్నయ్య అని సుభాష్ కు సర్ది చెప్తాడు ప్రకాశం.

publive-image

భర్తను ఏడిపించాలని ఫిక్స్ అయిన కావ్య, ఆమె బావ.. రాజ్ ముందు కావాలనే రెచ్చిపోతారు. క్యారమ్ బోర్డు ఆడుతూ కావ్య, తన బావ ఇద్దరూ క్లోజ్ గా మూవ్ అవుతారు. ఇది చూసి జెలసీగా ఫీలైన రాజ్ నేను కూడా ఆడతనాని వస్తాడు. రాజ్ ముందు మరింత రెచ్చిపోతాడు కావ్య బావ. కావ్య చేయి పట్టుకొని ఎలా ఆడాలో నేర్పిస్తాడు. ఇందంతా చూసి తట్టుకోలేకపోయిన రాజ్ కోపంతో రగిలిపోతారు.

Also Read: Nayanthara: నయనతార విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భర్త విఘ్నేష్ ..!

publive-image
కోపంతో రూమ్ లోకి వచ్చిన రాజ్.. కావాలనే కావ్య వేసిన డిజైన్స్ పై ఇంక్ వేసి వాటిని పాడు చేస్తాడు. మళ్ళీ ఏమీ తెలియనట్లు.. కావ్యను పిలిచి వెంటనే డిజైన్స్ కావాలి.. క్లైంట్స్ అడుగుతున్నారని చెప్తాడు. డిజైన్స్ పై ఇంక్ పడి ఉండడంతో టెన్షన్ పడుతుంది కావ్య.

publive-image
ఛాన్స్ దొరికిందని కావ్యను ఆడుకోవాలని చూస్తాడు రాజ్. ఇంతలో అక్కడికి వచ్చిన కావ్య బావ.. పేపర్ ఇంక్ పడితే ఏంటీ.. నాతో ఫోటోలు ఉన్నాయి కదా అని రాజ్ కు పెద్ద షాకిస్తాడు. దీంతో రాజ్ ఇరిటేట్ అవుతాడు.

publive-image
మరో వైపు ధాన్యలక్ష్మి తన భర్త సుభాష్ ను అలా మాట్లాడడం సహించలేకపోతుంది అపర్ణ. తన భాదను ఇందిరాదేవితో చెప్పుకుంటుంది. ధాన్యలక్ష్మి మమల్ని వేరు చేసి మాట్లాడింది.. ఆ బాధతో ఆయన కుమిలిపోతున్నారు అంటూ అత్తగారితో వాపోతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: National: స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం.. సోషల్ మీడియాలో భర్త ఆవేదన!

Advertisment
తాజా కథనాలు