Brahmamudi Serial: రాజ్ చేసిన మోసానికి మనసు ముక్కలైన కావ్య.. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఏడుస్తూ కూర్చుంటుంది. భర్తతో ఉన్న జ్ఞాపకాలను తలుచుకొని బాధపడుతుంది. ఆ తర్వాత భర్తను నిలదీయడానికి గదిలోకి వెళ్తుంది కావ్య.
రాజ్ గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కావ్య.. అందరు బిడ్డ గురించి మాత్రమే అడుగుతున్నారు. అసలు ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్పమని నిలదీస్తుంది. రాజ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు.
భర్త రాజ్ మౌనంగా ఉండడంతో కావ్య గట్టిగా నిలదీస్తుంది. దీంతో రాజ్ ఏం చెప్పాలి. అడిగే స్థానంలో నువ్వు ఉన్నావు.. చెప్పలేని దూరంలో నేను ఉన్నాను అని బదులిస్తాడు రాజ్. ఇలా మాటలు చెప్పి తప్పించుకోవాలని చూడకండి అని రాజ్ పై ఫైర్ అవుతుంది కావ్య.
రాజ్ చేసిన పనికి ఇంట్లో అందరు షాక్ లో ఉండిపోతారు. ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్, దిగాలుగా కూర్చుంటారు. కావ్య జీవితం ఏమైపోతుందో అని బాధపడుతుంది ఇందిరాదేవి.
మరో వైపు కూతురు జీవితం అన్యాయం కావడంతో అపర్ణతో గొడవ పెట్టుకుంటుంది కనకం. దీంతో అపర్ణ.. నీ కూతురు జేష్ట్య దేవిలాగా మా గడపలో కాలు మోపిన రోజు నుంచే మా ఇంటికి అరిష్టం పట్టుకుంది అని కనకం పై కోప్పడుతుంది.
కావ్య పై అపర్ణ ఆరోపణలు తట్టుకోలేకపోయిన కనకం.. నా కూతురికి ఇంత అన్యాయం చేసి పై నుంచి దాన్నే తప్పుపడితే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో అపర్ణ నీ కూతురికి అంత కష్టంగా ఉంటే.. పుట్టింటికి తీసుకెళ్ళు.. ఇంకా ఇక్కడే ఎందుకు ఉంచావు అని కనకం పై రెచ్చిపోతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.