Brahmamudi Serial: భార్య ముందే అప్పును కలవడానికి వెళ్లిన కళ్యాణ్.. ఏడుస్తూ కూర్చున్న అనామిక.. కావ్యకు షాకిచ్చిన రాజ్

కళ్యాణ్ భార్య అనామిక ముందే అప్పును కలవడానికి వెళ్తాడు. దీంతో అనామిక ఏడుస్తూ ఉంటుంది. మరో వైపు కావ్య, తన బావ ఆటలకు చెక్ పెట్టాలని రివర్స్ గేమ్ మొదలు పెడతాడు రాజ్. ఇక రాజ్ ప్రవర్తనతో కావ్య షాక్ అవుతుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: భార్య ముందే అప్పును కలవడానికి వెళ్లిన కళ్యాణ్.. ఏడుస్తూ కూర్చున్న అనామిక.. కావ్యకు షాకిచ్చిన రాజ్

Brahmamudi Serial: కావ్య , తన బావ , ఇందిరదేవి గార్డెన్ లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కావ్యను తన బావతో క్లోజ్ గా చూస్తున్న రాజ్ ఉడికిపోతాడు. ఇంతలో రాజ్ నుంచి బయటకు వచ్చిన తన అంతరాత్మ.. నీ ఈగో పక్కన పెట్టేసి కావ్యతో నీ ప్రేమ గురించి చెప్పు అని రాజ్ తో చెప్తుంది. దీంతో ఈగోకు పోయిన రాజ్ అది ఎప్పటికీ జరగదు. నేను కళావతిని ప్రేమించడం ఏంటీ అంటూ తన అంతరాత్మతో వాదిస్తాడు.

publive-image

మరో వైపు కళ్యాణ్ అప్పుకు కాల్ చేసి కలవాలని చెప్తాడు. కానీ అప్పు మాత్రం కలవడానికి రానని చెప్తుంది. దీంతో కళ్యాణ్ తాను భాదలో ఉన్నానని ఒకసారి కలవాలని చెప్తాడు. ఇక అప్పు కూడా సరే కలుద్దాం అని చెప్తుంది.

publive-image

భర్త అప్పును కలవడానికి వెళ్తున్నాడు అని తెలుసుకున్న అనామిక కళ్యాణ్ తో వాదిస్తుంది. దీంతో కళ్యాణ్.. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో మాకు తెలుసు.. దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏమి చేయలేను అని భార్యకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.

publive-image

కళ్యాణ్ వెళ్లిపోవడంతో అనామిక ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మి కోడలికి దైర్యం చెప్తుంది. మీ ఇద్దరి మధ్య ఏవైనా గొడవలు ఉంటే వాటిని లోపలే పరిష్కరించుకోండి. అందరికీ ఈ విషయాలు తెలిస్తే చులకన అయిపోతావు అని సలహా ఇస్తుంది.

publive-image

భర్తను ఉడికించాలి కావ్య, తన బావ ఇద్దరు రాజ్ దగ్గరకు వస్తారు. ఇక నుంచి వాళ్ళను చూసి జేలసీగా ఫీల్ అవ్వకూడదని ఫిక్స్ అయిన రాజ్.. కావాలనే వాళ్ళు ఏం చేసినా పట్టించుకోనట్లు ఉంటాడు. ముందులా రాజ్ ఏం రియాక్ట్ కాకపోవడంతో కావ్య, తన బావ షాక్ అవుతారు.

publive-image

కావ్య,భాస్కర్( బావ) ఆటకట్టించడానికి రాజ్ రివర్స్ లో గేమ్ మొదలు పెట్టాడని అర్థం చేసుకున్న కావ్య , ఇందిరాదే వి, భాస్కర్.. ఇంక లాభం లేదని కొత్త ప్లాన్ అమలు చేయడానికి డిసైడ్ అవుతారు ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read : NBK109 Glimpse : ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌”.. బాలయ్య NBK 109 గ్లింప్స్ .. ఫ్యాన్స్ కు పూనకాలే

Advertisment
తాజా కథనాలు