Brahmamudi: అపర్ణను చంపడానికి ప్లాన్ మొదలు పెట్టిన రుద్రాణి.. దిమ్మతిరిగే షాకిచ్చిన కావ్య ..!

కోడలు కావ్య పట్ల గతంలో ఆమె ప్రవర్తించిన తీరును తలుచుకొని బాధపడుతుంది అపర్ణ. మరో వైపు సుభాష్ చేసిన తప్పు గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ అపర్ణను ఇంకా బాధపెట్టే ప్రయత్నం చేస్తుంది రుద్రాణి. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi: అపర్ణను చంపడానికి  ప్లాన్ మొదలు పెట్టిన రుద్రాణి.. దిమ్మతిరిగే షాకిచ్చిన కావ్య ..!

Brahmamudi:అపర్ణను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వస్తారు. ఇక రుద్రాణి తన ప్లాన్ ప్రకారం అపర్ణ ఇంటికి రాగానే మళ్ళీ పంచాయితీ మొదలు పెడుతుంది. ఇంతటితో అయిపోలేదు ఆ రెండో వదిన ఎవరో కనిపెట్టాలి కదా అంటూ అపర్ణను బాధపెట్టేలా మాట్లాడుతుంది. దీంతో కావ్య రుద్రాణి పై గట్టిగా అరుస్తుంది. ఇంకోసారి మీ నోటి నుంచి ఆ మాట వస్తే.. మర్యాదగా ఉండదు అని రుద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. కావ్య వార్నింగ్ తో నోరు మూసుకుంటుంది రుద్రాణి.

publive-image

ఇక రుద్రాణి మాటలను తలుచుకుంటూ బాధపడుతుంటుంది అపర్ణ. దీంతో రాజ్.. అమ్మ ఇప్పుడు నీ ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచించాలి అని అపర్ణకు దైర్యం చెప్తాడు. ఆ తర్వాత అపర్ణను తన గదికి తీసుకొని వెళ్తాడు. ఇక సుభాష్ డోర్ ఓపెన్ చేయబోతుంటే భర్తను చూసి అసహ్యంతో మొహం తిప్పుకుంటుంది అపర్ణ. దీంతో సుభాష్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు.

publive-image

ఆ తర్వాత కావ్య గదిలోకి వెళ్లిన రాజ్ కావ్య పై కోప్పడతాడు. ఇక నుంచి మాయ గురించి పట్టించుకోకు .. నువ్వు చేసిన పని వల్లే మా అమ్మ హాస్పిటల్ పాలైంది అని కావ్యకు వార్నింగ్ ఇస్తాడు. కానీ కావ్య మాత్రం రాజ్ మాటలను లెక్క చేయదు. ఎలాగైనా మాయను పట్టుకొని అసలు నిజం బయటపెడతానని రాజ్ తో ఛాలెంజ్ చేస్తుంది.

publive-image

మరో వైపు గదిలో ఒంటరిగా కూర్చున్న అపర్ణ.. అసలు నిజం తెలియక కావ్య పట్ల ప్రవర్తించిన తీరును తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన భర్త చేసిన తప్పుకు కోడలికి అన్యాయం చేశానని పశ్చాత్తాపంతో బాధపడుతు ఉంటుంది.

publive-image
ఇంతలో కావ్య అత్త అపర్ణ కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది. కానీ అపర్ణ మాత్రం కావ్యను గదిలోకి రావద్దని చెబుతుంది. నువ్వు నాకు ఎదురుపడుతుంటే.. ఈ కుటుంబం కోసం నువ్వు చేసిన త్యాగాల గురించి ప్రశ్నించినట్లుగా ఉంది. నిజం తెలుసుకోకుండా నిన్ను అన్నేసి మాటలు అన్న నా సంస్కారాన్ని ప్రశ్నించినట్లుగా అనిపిస్తుంది అని అపర్ణ కన్నీళ్లతో పెట్టుకుంటుంది. కానీ కావ్య మాత్రం మిమల్ని చూసుకోవడం నా బాధ్యత అంటూ అత్త అపర్ణకు సేవలు చేస్తుంది.

publive-image
ఆ తర్వాత అపర్ణ మళ్ళీ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇది గమనించిన రాజ్ తల్లి అపర్ణను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. దీంతో అపర్ణ నీకు మీ అమ్మ కంటే.. మీ నాన్న పరువే ఎక్కువ అందుకే నిజం చెప్పకుండా నన్ను మోసం చేశావు అని బాధపడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.publive-image

Also Read: Sai Tej : మెగా ఫ్యామిలీ Vs అల్లు ఫ్యామిలీ.. సాయి తేజ్ అలా చేశాడేంటి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు