Brahmamudi Serial: కళ్యాణ్, కావ్య ప్లాన్ సక్సెస్.. రాజ్ కు ఇక నుండి చుక్కలే..!

బ్రహ్మముడి సీరియల్ లో మొత్తానికి కళ్యాణ్, కావ్య ప్లాన్ సక్సెస్ అవుతుంది. కావ్య ఆఫీస్‌కు వెళ్లేందుకు అత్త అపర్ణ ఒప్పుకుంటుంది. ఆ నిర్ణయం ఇష్టం లేని ధాన్యలక్ష్మీ మాత్రం రగిలిపోతుంటుంది. కావ్య ఆఫీస్ కు వస్తుందనే వార్త విని భర్త రాజ్‌ షాక్ అవుతాడు.

New Update
Brahmamudi Serial: కళ్యాణ్, కావ్య ప్లాన్ సక్సెస్.. రాజ్ కు ఇక నుండి చుక్కలే..!

Brahmamudi Serial: భర్త రాజ్ కు శ్వేతకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలని కావ్య, కళ్యాణ్ కలిసి ప్లాన్ చేస్తుంటారు. వదిన ఆఫీస్ కు వెళ్తే వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుందని కళ్యాణ్ అంటాడు. కావ్య ఆఫీస్ కు వెళ్లేందుకు అపర్ణ, ధాన్యలక్ష్మీ మధ్య ఉన్న గొడవను ఉపయోగించుకోవాలని అనుకుంటారు. కావాలనే కళ్యాణ్, కావ్య సీక్రెట్ గా మాట్లాడుతున్నట్లు నటిస్తూ అలా ధాన్యలక్ష్మీ వారి మాటలు వినేలా యాక్టింగ్ చేశారు.

publive-image

ధాన్యలక్ష్మీ ఫైర్

ఇంట్లో అందరూ టిఫిన్ తినడానికి డైనింగ్ టెబుల్ ముందు కూర్చుంటారు. కావ్య అందరికి వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే అత్త అపర్ణ ను డిజైనర్ గా ఆఫీస్ కు వెళ్లాలని ఉందని అందుకు పర్మిషన్ కావాలని అడుగుతుంది. వెంటనే ధాన్యలక్ష్మీ కావ్యపై నిప్పులు చెరుగుతుంది. నీకు వంటిల్లే కరెక్ట్ ప్లేస్..అందరికి వండి పెడితే చాలు.. మా అక్క ముందే చెప్పింది కదా ఇంటి పని చూసుకో..ఆఫీస్ కు వెళ్లి రాజ్యమేలుదామని అని అనుకుంటున్నావా అని మండిపడుతుంది.

publive-image

పర్మిషన్ గ్రాంటెడ్

అది విన్న అపర్ణ.. నా కోడలిని శాసించడానికి నువ్వు ఎవరూ? ఇంట్లో అందరికి వండి తగిలేయడానికి నా కోడలు పనిమనిషా? కావ్య వేసిన డిజైన్స్ కు ఇంటర్ నేషనల్ లో పేరొచ్చింది. అలాంటి తనను వెళ్ళొద్దు అని చెప్పాడానికి నీకేం హక్కు అని తిడుతుంది. తన కోడలికి అండగా నిలబడుతుంది. ఆఫీస్ వెళ్లడానికి ఒకే అంటుంది. అది విన్న కళ్యాణ్, స్వప్న, కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

publive-image

రాజ్ షాక్

అపర్ణ నిర్ణయంతో  ధాన్యలక్ష్మీ తన కోడలు అనామిక రగిలిపోతుంటారు. ఆఫీస్ కు బయలుదేరేందుకు కావ్య రెడీ అవ్వడానికి వెళ్తుంది. భర్త రాజ్ కు ఈ విషయం చెబుతుంది. కానీ, రాజ్ నమ్మడు.. మా అమ్మ.. నిన్ను.. ఆఫీస్ కు వెళ్లడానికి ఓకే చెప్పిందా? నేను నమ్మను అని అంటాడు. తరువాత నీ భార్యను కూడా  ఆఫీస్ కు తీసుకెళ్లంటూ అపర్ణ రాజ్ కు చెబుతుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు.

Also Read: ఓటీటీలో హనుమాన్ స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ ఇదే

Advertisment
తాజా కథనాలు