Brahmamudi Serial: ఇంట్లో చిచ్చు పెట్టిన రుద్రాణి.. నిప్పులు చెరుగుతున్న తోడికోడళ్ళు.. అల్లడిపోతున్న భర్తలు..!

బ్రహ్మముడి సీరియల్ ‌లో రుద్రాణి పెట్టిన చిచ్చుకి అపర్ణ, ధాన్యలక్ష్మీ గొడవపడుతుంటారు. అది చూసిన రుద్రాణి బాగా కొట్టుకుని చావడంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు రాజ్, శ్వేతల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కావ్య ఆఫీస్‌కు వెళ్లాలనుకుంటుంది.

New Update
Brahmamudi Serial: ఇంట్లో చిచ్చు పెట్టిన రుద్రాణి.. నిప్పులు చెరుగుతున్న తోడికోడళ్ళు.. అల్లడిపోతున్న భర్తలు..!

Brahmamudi Serial: అప్పు కళ్యాణ్ ప్రేమ నుంచి బయట పడేందుకు ఎదైనా పని చేయాలని అనుకుంటుంది. కుటుంబం కోసం కష్టపడాలని రెడీ అయి బయటకు వెళ్తుంది. అప్పుడే అమ్మ కనకం వస్తుంది..అప్పు ప్రేమ నుండి బయటపడుతుందని సంతోషపడాలా.. ఇంటి కోసం కష్టపడుతుందని బాధ పడాలో అర్థం కావట్లేదని భర్తతో అంటుంది.

publive-image

భర్తకు చుక్కలు చూపిస్తోన్న కావ్య

మరోవైపు రాజ్ శ్వేతకు ఉన్న సంబంధం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలని కళ్యాణ్, కావ్య ట్రై చేస్తు ఉంటారు. కావ్యకు భర్త రాజ్ పై కొపంగా ఉన్న తనను డైరెక్ట్ గా అడగకుండా, తిట్టకుండా ఇన్ డైరెక్ట్ గా  కొత్త క్లైంటా.. పాత క్లైంటా.. అంటూ మాటలతో రాజ్ కు చుక్కలు చూపిస్తుంది. కావ్య రూం నుండి బయటికి వెళ్లగానే శ్వేత ఫోన్ చేస్తుంది. ఆఫీస్ వర్క్ అయ్యాక కచ్చితంగా కలుస్తానంటూ రాజ్ కాల్ కట్ చేస్తాడు.

publive-image

తోడికోడళ్ళ వార్

తర్వాత కళ్యాణ్ వచ్చి పెద్దమ్మ గీజర్ రిపేర్ చేసే టెక్నిషీయన్ కావాలన్నారు కదా? ఎ టైంకు రమ్మంటారని అడుగుతాడు. వద్దు కల్యాణ్.. నేను రాజ్‌ను అడిగి చేయించుకుంటానని అపర్ణ అంటుంది. నన్ను వేరేలా చూస్తున్నారా పెద్దమ్మ అని కల్యాణ్ అంటాడు. నేను నా బిడ్డలాగే చూసుకున్నాను కళ్యాణ్ కానీ, కాదని నిన్ననే అర్థమైందని అంటుంది. అపర్ణ మాటలకు ధాన్యలక్ష్మీ మళ్లీ గొడవకు దిగుతుంది. అది చూసిన రుద్రాణి మనసులో చాలా హ్యాపిగా ఫీలవుతుంది. కళ్యాణ్ కు రహుల్ కు అధికారం ఇవ్వాలని కావాలనే తోడకోడళ్ళ మధ్య విభేదాలు సృష్టించింది.

publive-image

చెప్పుడు మాటలు..

అపర్ణ, ధాన్యలక్ష్మీ ఇద్దరు మాటకు మాట మాట్లాడుతూ గొడవపడటంతో ఇందిరాదేవి వారిద్దరిపై మండిపడుతుంది. భార్యలు గొడవ పడుతుండటంతో వారిద్దరి భర్తలు కూడా మధ్యలో అల్లాడిపోతుంటారు. చెప్పుడు మాటలు బాగా విని ఇంటిని ముక్కలు చేసేలా ఉన్నారని ఇద్దరికి క్లాస్ తీసుకుంటుంది ఇందిరాదేవి. ఇంటిని చక్కదిద్దాల్సిన మీరే ఇలా గొడవ పడితే ఎలా అంటూ ఇద్దరికి మంచి సూచనలు ఇస్తుంది.

publive-image

Also Read: నాకింకా 30 ఏళ్ళే.. మళ్ళీ పెళ్ళి చేసుకుంటా – నీహారిక

Advertisment
తాజా కథనాలు