Brahmamudi Serial: అనామిక ఏమో భర్త కళ్యాణ్‌ను దుగ్గిరాల ఫ్యామిలీ నుంచి దూరం చేయాలని అనుకుంటుంది. అందుకోసం రుద్రాణి హెల్ప్ తీసుకుంటుంది. మరోవైపు అనామిక ద్వారా దుగ్గిరాల ఫ్యామిలీలో గొడవలు సృష్టించి రాహుల్ కు ఆస్తిలో వాట వచ్చేలా రుద్రాణి ప్లాన్స్ వేస్తుంటుంది. కిచెన్‌లో వంట చేస్తోన్న ధాన్యలక్ష్మికి కొడుకు కళ్యాణ్ ఆఫీసుకు వెళుతున్నాడా? బిజినెస్ చూసుకుంటున్నాడా? అంటూ చిచ్చు పెడుతుంది.
నిరసంగా కావ్య
భర్త రాజ్ శ్వేతతో క్లోజ్ గా ఉండటం..ఆఫీస్ వర్క అని చెప్పి శ్వేత ఇంటికి వెళ్లడం అన్నీ తలుచుకుంటూ కావ్య కళ్లు తిరిగిపడిపోతుంటే అక్క స్వప్న తనను పట్టుకుంటుంది. కావ్యకు సరిగ్గా రెస్ట్ లేకపోవడంతో నిరసంగా ఉంటుంది. హాస్పటిల్ కు వెళ్లేందుకు రాజ్ కు కాల్ చేస్తుంది. అయితే భర్త రాజ్ తాను బిజీగా ఉన్నాడంటూ కాల్ కట్ చేస్తాడు. దీంతో, అక్క స్వప్ననే కావ్యను హాస్పిటల్ కు తీసుకెళ్తుంది.
శ్వేత సూసైడ్..!
ఇదిలా ఉండగా.. నన్ను కాపాడు రాజ్ అని శ్వేత రాజ్ కు కాల్ చేస్తుంది. టెన్షన్ టెన్షన్ గా ఆమె ఇంటికి వెళుతాడు రాజ్. శ్వేత హాండ్ కట్ అయి ఉండటం చూసి షాక్ అవుతాడు. అయితే, శ్వేత సూసైడ్ చేసుకుందా? లేదంటే ఏవరైనా ఆమెను చంపేందుకు అలా చేశారా? అనేది క్లారిటీ లేదు. వెంటనే తనని ఆసుపత్రికి తీసుకెళ్తాడు. ట్రీట్ మెంట్ చేసే డాక్టర్ కు.. రాజ్ తనకు కాబోయే భర్త అని అబద్ధం చెబుతుంది. అది విన్న నర్స్ మరో నర్సుకు చెబుతుండగా అదే హాస్పిటల్ కు వెళ్లిన కావ్య ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
కావ్యను వదిలేస్తాడా?
ఇలా బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ కాస్తా ఎమోషనల్ గా కనిపిస్తుంది. పాపం కావ్య భర్తకు వేరే మహిళతో సంబంధం ఉంటుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ, రాజ్ రాముడే అని సీరియల్ అభిమానులకు క్లియర్ గా తెలుస్తోంది. శ్వేత పరిస్థితి చూస్తుంటే..తన భర్త సైకో అని ఆమెను టార్చర్ చేయడంతోనే విడాకులు తీసుకుంటుందని అనిపిస్తుంది. అయితే, రాజ్ కావ్యను వదిలేస్తాడా? శ్వేతను రెండో పెళ్లి చేసుకుంటాడా? అనేది వేచి చూడాలి.
Also Read: ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్