Brahmamudi Serial: బావతో షికారుకు వెళ్లిన కావ్య.. భార్య పై నింద మోపాలని రాజ్ ప్లాన్

కావ్య తన బావతో కలిసి షికారుకు వెళ్తుంది. భార్య పరాయి వ్యక్తితో క్లోజ్ ఉండడం తట్టుకోలేకపోతున్న రాజ్ జెలసీగా ఫీల్ అవుతాడు. ఈ విషయాన్నీ ఇంట్లో వాళ్లకు చెప్పి కావ్య పై నింద మోపాలని ప్లాన్ చేస్తాడు. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: బావతో షికారుకు వెళ్లిన కావ్య.. భార్య పై నింద మోపాలని రాజ్ ప్లాన్

Brahmamudi Serial: శ్వేత‌కు విడాకులు వచ్చినందున.. ఆ సంతోషాన్ని సెలెబ్రేట్ చేయడానికి కేక్ తెప్పిస్తాడు రాజ్. కావ్యను రెచ్చగొట్టడానికి.. శ్వేతకు కేక్ తినిపిస్తూ క్లోజ్ గా ఉంటాడు. ఇటు కావ్య కూడా తన బావతో చనువుగా ఉన్నట్లు నటిస్తూ రాజ్ కు కౌంటర్ ఇస్తుంది.

publive-image
కావ్య బావతో కలిసి షికారుకు వెళ్ళడానికి రాజ్ ను రెండు గంటలు పర్మిషన్ అడుగుతుంది. భార్య పరాయి వ్యక్తితో క్లోజ్ గా మూవ్ అవ్వడం తట్టుకోలేకపోతున్న రాజ్.. ఆఫీస్ లో వర్క్ ఉంది.. వెళ్ళడానికి వీలు లేదని చెప్తాడు. దీంతో కావ్య.. వాదించడం మొదలు పెడుతుంది. ఇక చేసేదేమీ లేక పర్మిషన్ ఇస్తాడు రాజ్.

publive-image
కావ్య తన బావతో షికారుకు వెళ్లడంతో.. కోపంతో రగిలిపోతుంటాడు రాజ్. నా ముందే తన బావతో ఎలా షికారుకు వెళ్తుంది అని శ్వేతతో అంటాడు. దానికి శ్వేత.. నీ భార్యకు విడాకులు ఇవ్వాలని ఫిక్స్ అయినప్పుడు.. తాను ఎవరితో వెళ్తే నీకెందుకు.. అంటే నీకు కావ్య ప్రేమ ఉంది అని నిలదీస్తుంది. ఈగోతో భార్య పై ప్రేమను ఒప్పుకోలేకపోతున్న రాజ్.. ఇది ప్రేమకు కాదు.. దుగ్గిరాల ఇంటి పరువు కోసం ఆలోచిస్తున్నాను అని దాటేస్తాడు.

publive-image
మరో వైపు ధాన్యలక్ష్మీ, అనామికల మనసులో విషం నింపే ప్రయత్నం చేస్తుంది రుద్రాణి. ఎప్పటికైనా.. మీరు అపర్ణ కింద అణిగిమనిగి ఉండాల్సిందే.. ఈ ఇంటి పెత్తనం మీ చేతికి రావడం కష్టం అంటూ ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన స్వప్న.. ఇలాంటి చెప్పుడు మాటలు వింటే పచ్చని కాపురాలు నాశనం అవుతాయని రుద్రానికి క్లాస్ పీకుతుంది.

publive-image
కావ్య.. ఆఫీస్ నుంచి తన బావతో షికారుకు వస్తుంది. శ్వేతతో రాజ్ ప్రవర్తనను గమనించిన కావ్య బావ.. రాజ్ శ్వేతను పెళ్లి చేసుకుంటున్నానని ఇండైరెక్ట్ గా చెప్పినట్లుగా అనిపిస్తుందని కావ్యతో అంటాడు. అలాంటిది ఏమీ లేదు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే.. నన్ను దూరం చేసుకోవాలని ఆయన ఆడుతున్న డ్రామా అని చెప్తుంది కావ్య.

publive-image
భార్య పై కోపంతో రగిలిపోతున్న రాజ్.. బావతో కలిసి షికారుకు వెళ్లిందనే విషయాన్నీ ఇంట్లో వాళ్లకు చెప్పి.. కావ్య పై నింద వేయాలని ప్లాన్ చేస్తాడు. ఇలా నింద వేస్తేనైన.. నా పై అసహ్యం కలిగి విడాకులు ఇస్తుందని ఆలోచిస్తాడు.

publive-image
కోపంతో ఇంటికి వెళ్లిన రాజ్.. భార్య షికార్ల గురించి ఇందిరాదేవితో చెప్తాడు. ఆల్రెడీ ప్లాన్ మొత్తం తెలిసిన ఇందిరాదేవి కావ్యకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. కావ్య చాలా మంచి అమ్మాయి.. బావతో బయట షికార్లు చేయకుండా.. పద్దతిగా ఇంటికే తీసుకువచ్చిందని రాజ్ కు పెద్ద షాకిస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు