Brahmamudi Serial: ఇందిరాదేవి ప్లాన్ ఫలించింది.. కావ్య ప్రవర్తనతో అల్లాడిపోతున్న రాజ్

అమెరికా నుంచి మా బావ వస్తున్నాడు అంటూ రాజ్ పై రివెంజ్ మొదలు పెడుతుంది కావ్య. అసలు ఆ బావ ఎవరని టెన్షన్ తో అల్లాడిపోతాడు రాజ్. మరో వైపు కావ్య పెత్తనం పై అత్తకు ఫిర్యాదు చేస్తుంది అనామిక. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: ఇందిరాదేవి ప్లాన్ ఫలించింది.. కావ్య ప్రవర్తనతో అల్లాడిపోతున్న రాజ్

Brahmamudi Serial: కావ్య.. శ్వేతతో మీకు నచ్చినంత సేపు మాట్లాడుకోండి అని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. శ్వేతతో మాట్లాడితే.. ఉడికిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని అనుకుంటే.. ఇలా చేస్తుంది ఏంటీ అని కన్ఫ్యూజ్ అవుతాడు.

publive-image

ఆ తర్వాత పడుకునే ముందు రాజ్ కు ఒక సర్ ప్రైజ్ ఇస్తానని చెప్తుంది కావ్య. దీంతో సర్ ప్రైజ్ ఏంటని అడుగుతాడు రాజ్. చెప్తే సర్ ప్రైజ్ ఎందుకు అవుతుంది.. రేపటి వరకు వెయిట్ చేయండి అని రాజ్ ను ఊరిస్తుంది కావ్య. అయినా నీ సర్‌ప్రైజ్ గురించి నాకెందుకు అని పడుకుంటాడు రాజ్.publive-image

మరో వైపు ఆఫీస్ కు వెళ్లి వచ్చిన కళ్యాణ్ ను.. ఆఫీస్ లో ఏం జరిగిందని అడుగుతుంది అనామిక. దాంతో కళ్యాణ్ ఆఫీస్ లో వాచ్ మెన్, ఎంప్లాయిస్ కు కవితలు చెప్పుకుంటూ కూర్చున్న సీన్ గుర్తుచేసుకుంటాడు. కానీ భార్య ముందు మాత్రం గొప్పలు చెప్పుకుంటాడు. ఇక కళ్యాణ్ నిజంగానే ఆఫీస్ తెగ పనిచేశాడు అని ఫీలైన అనామిక పొంగిపోతుంది.

publive-image
కావ్య సర్ ప్రైజ్ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్న రాజ్ ఉదయం లేవగానే... వంట గదిలో ఉన్న కావ్యను సర్ప్రైజ్ ఏంటని మళ్ళీ అడుగుతాడు. అయ్యో రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ పడుకున్నారా.. అంటూ రాజ్ ను ఆడుకుంటుంది కావ్య. ఇంతలో అక్కడికి వచ్చిన ఇందిరాదేవి.. ఏంటీ కావ్య సర్ప్రైజ్ ఉంది కదా.. ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్తుంది. దీంతో రాజ్ నాన్నమ్మ నువ్వైనా చెప్పు అని అడుగుతాడు. కానీ ఇందిరాదేవి కూడా చెప్పకుండా రాజ్ ను ఆడుకుంటుంది.

publive-image

మరో వైపు స్వప్న కోసం పని మనిషి జ్యూస్ తీసుకొని వస్తుంది. దీంతో స్వప్న.. నువ్వు ఎందుకు తెచ్చావు.. మా అత్త ఎక్కడ అని సీరియస్ అవుతుంది. రుద్రాణి దగ్గరకు వెళ్లి.. నాకు కావాల్సినవి అన్నీ నువ్వే చూసుకోవాలి.. లేదంటే అమ్మమ్మకు చెప్తాను అని వార్నింగ్ ఇస్తుంది.

publive-image
రూమ్ లో కావ్య రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రాజ్.. ఏంటీ మళ్ళీ అప్పలమ్మలా రెడీ అవుతున్నావని అంటాడు. ఇలా కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారులే అని రాజ్ కు వెటకారంగా సమాధానం చెబుతుంది. అసలు ఎక్కడికి వెళ్తున్నావని రాజ్ అడుగుతాడు. దీనికి కావ్య .. ఎయిర్ పోర్ట్ నుంచి మా బావ వస్తున్నాడు.. తను చాలా పొడవుగా, అందంగా, స్మార్ట్ గా ఉంటాడు అని చెబుతుంది. కావ్య ఇలా చెప్పడంతో రాజ్ లోపల ఉడికిపోతూ ఉంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Paayal Raajput Video: బాటిల్ తో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్.. వైరలవుతున్న వీడియో

Advertisment
తాజా కథనాలు