Brahmamudi Serial: భార్యను కంట్రోల్ లో పెట్టుకోమని.. శ్వేత భర్తకు కావ్య వార్నింగ్.. పోలీస్ అవుతానని షాకిచ్చిన అప్పు భార్య విషయంలో రాజ్ తప్పు చేస్తున్నాడని శ్వేత అంటుంది. కావ్య ను కలిసిన శ్వేత భర్త అరవింద్.. రాజ్ పై చాడీలు చెబుతాడు. తన మాటలు లెక్కచేయని కావ్య.. నీ భార్యను కంట్రోల్ లో పెట్టుకోమని వార్నింగ్ ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. By Archana 06 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi Serial: రాజ్ కావ్యకు విడాకులు ఇస్తానని చెప్పడంతో.. శ్వేత కోపంగా రాజ్ తిడుతుంది. మనిద్దర్నీ కావ్య అపార్థం చేసుకుంటుంది.. మన మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని కావ్య చెప్పు అని రాజ్ కు హిత భోద చేస్తుంది. కావ్య చాలా మంచిది.. నువ్వు, కావ్య హ్యాపీగా ఉండాలని రాజ్ ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. శ్వేత ఎంత చెప్పిన.. రాజ్ మాత్రం వినిపించుకోకుండా.. నేను కావ్యతో ఉండలేనని తెగేసి చెప్తాడు. అయితే నా భర్తకు.. నీకు పెద్ద తేడా ఏం లేదు.. వాడు బయటకు కనిపిస్తాడు.. నువ్వు మాత్రం కనబడకుండా కాపురాన్ని కూల్చుకుంటున్నావు అని రాజ్ ను మందలిస్తుంది. నా భర్త మూర్ఖుడు అందుకే నన్ను ఇలా బాధపెడుతున్నాడు.. కానీ నువ్వు చదువుకున్నావు, తెలివైనవాడివి ఇలా చేయడం తప్పు అని చెప్తుంది. రాజ్, శ్వేత ఇద్దరు క్యాబిన్ లో మాట్లాడుకోవడం చూసిన కావ్య కోపంతో రగిలిపోతుంది. కళ్యాణ్ కు ఫోన్ చేసి నేను మొదటి సారి మర్డర్ చేస్తున్నాను. నాకు ఆయుధాలు కావాలని కోపంలో తిక్కతిక్కగా మాట్లాడుతుంది. వదిన అలా మాట్లాడడంతో షాక్ అవుతాడు కళ్యాణ్ . Also Read: Sitara Dance Video: నాన్న పాటకు స్టెప్పులేసిన మహేశ్ ముద్దుల కూతురు.. ధమ్ మసాలా వీడియో వైరల్! ఇటు రాజ్ శ్వేతను పంపించడానికి కారు దగ్గరికి వస్తాడు. శ్వేత వెళ్తుండగా.. కావ్యను వదిలేయడానికి ఒక్క కారణం కూడా చూపించలేకపోయావు. మీ ఇద్దరి మధ్య గొడవలే లేవు.. తనను అర్ధం చేసుకో అని రాజ్ ను మళ్ళ్లీ కన్విన్స్ చేస్తుంది. ఇదంతా కావ్య చూడడం గమనించిన రాజ్.. కావాలనే తన ముందు శ్వేత భుజం పై చేయి వేసి దగ్గరుండి జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. భర్త అలా చేయడంతో కావ్యకు మండిపోతుంది. ఇది ఇలా ఉంటే అప్పును కోసం ఒక పెళ్లి సంబంధం వస్తుంది. కానీ అప్పు మాత్రం నేను చేసుకోను అని చెప్పేస్తుంది. దీంతో కనకం సీరియస్ అవుతుంది. పెళ్లి ఎందుకు వద్దంటున్నావు.. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అప్పును నిలదీస్తుంది. దానికి అప్పు నేను పోలీస్ అవ్వాలిని నిర్ణయం తీసుకున్నని షాక్ ఇస్తుంది అప్పు. ఆఫీస్ నుంచి కావ్య తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కారుకు అడ్డంగా శ్వేత భర్త వచ్చి నిలబడతాడు. ఎందుకు కారుకు అడ్డంగా వచ్చావు.. ఎవరు నువ్వు అని కావ్య ప్రశ్నిస్తుంది. నేను శ్వేత భర్త అరవింద్ అని చెప్పగానే షాక్ అవుతుంది. నా భార్య.. నీ భర్త కలిసి ఉన్న ఫోటోలు పంపింది నేనే అని చెప్పగానే.. అరవింద్ పై కావ్య సీరియస్ అవుతుంది. నీ భార్యను కంట్రోల్ లో పెట్టుకో అని వార్నింగ్ ఇస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. Brahmamudi Serial: భార్య ముందే వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్న రాజ్.. తట్టుకోలేకపోతున్న కావ్య..! #brahmamudi-serial-today-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి