Brahmamudi Serial: పుట్టు మచ్చతో భార్యకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజ్.. భర్త పై కావ్యకు మొదలైన అనుమానం..!

బిడ్డకు ఉన్నట్లే భర్త రాజ్ నడుము పై కూడా పుట్టు మచ్చ ఉందేమో అని కావ్యకు అనుమానం వస్తుంది. దీంతో భర్త నడుము పై మచ్చను చూసేందుకు ప్రయత్నిస్తుంది. మరో వైపు అనామికకు పెద్ద షాక్ ఇస్తాడు కళ్యాణ్. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: పుట్టు మచ్చతో భార్యకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజ్.. భర్త పై కావ్యకు మొదలైన అనుమానం..!

Brahmamudi Serial: కావ్య బిడ్డ తల్లి వెన్నెల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇందిరాదేవి అక్కడికి వచ్చిన ఇందిరాదేవి.. వెన్నెలతో నా మనవడికి ఉన్న బంధాన్ని బయటపెడితే.. ఈ ఇంట్లో నీ స్థానం ఏంటని ఆలోచించావా అని అడుగుతుంది. దీంతో కావ్య నేను తీసుకురాకపోయిన, ఏదో తానే వస్తే.. అప్పుడు మాత్రం ఏం చేస్తాను. నా జీవితం ఒక ప్రశ్నగా మిగిలిపోవాల్సిందే అని బాధపడుతుంది.

publive-image

మరో వైపు ధాన్యలక్ష్మి చేసిన రచ్చ తర్వాత కనకం, కృష్ణ మూర్తి, అప్పు ఇంటికి వస్తారు. ఆ తర్వాత.. మీడియా ముందు అంత పెద్ద గొడవ ఎలా జరిగిందని కూతురు అప్పును ప్రశ్నిస్తాడు కృష్ణమూర్తి. దీంతో అప్పు అలా జరుగుతుందని ఊహించలేదు నాన్న అని చెప్తుంది.

publive-image
కావ్య బాబును రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రుద్రాణి కావ్యను బాధపెట్టేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత బాబు నడుము పై పుట్టు మచ్చను గమనించిన రుద్రాణి.. ఇలాంటి పుట్టు మచ్చే రాజ్ నడుము పై కూడా ఉంది అని చెప్తుంది. దీంతో కావ్య ఆలోచనలో పడుతుంది. ఒకవేళ నిజంగానే ఆయన నడుము పై కూడా మచ్చ ఉంటే.. ఈ బిడ్డ తనే బిడ్డే అని కంఫర్మ్ అవుతుంది అని అనుకుంటుంది.

publive-image
గదిలో రాజ్ రెడీ అవుతూ ఉంటాడు. ఎలాగైనా భర్త నడుము పై పుట్టు మచ్చ ఉందా..? లేదా..? తెలుసుకోవాలని నిర్ణయించుకున్న కావ్య చూసేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన రాజ్ ఉలిక్కిపడతాడు.. ఏంటిదీ అని అంటాడు. దీంతో కావ్య ఏదో చెప్పి కవర్ చేస్తుంది.

publive-image
మరో వైపు కళ్యాణ్ గదిలోకి రాగానే అనామిక ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ కళ్యాణ్ మాత్రం భార్య పై కోపంగా ఉంటాడు. దీంతో అనామిక.. రేపటి నుంచి ఎండీ బాధ్యతలు చేపట్టబోతున్నావు ఎంత గొప్ప విషయం అని సంతోషపడుతుంది. ఈ గొప్పలు నీకు నచ్చుతాయి నాకు కాదు అని భార్య పై సీరియస్ అవుతాడు కళ్యాణ్. ఇది కేవలం అన్నయ కోసం మాత్రమే ఒప్పుకున్నాను. ఆయన రాగానే బాధ్యతల నుంచి తప్పుకుంటానని అనామికను షాక్ ఇస్తాడు.

publive-image
ఇటు కావ్య మాత్రం ఎలాగైనా పుట్టు మచ్చను చూడాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటుంది. రాజ్ షర్ట్ లోకి బొద్దింక దూరింది అనే సాకుతో పుట్టు మచ్చను చూస్తుంది. కానీ అక్కడ ఏ పుట్టు మచ్చ లేకపోవడంతో అయోమయంలో ఉంటుంది కావ్య. ఇందంతా గమనించిన రాజ్.. పుట్టు మచ్చ లేకపోతే.. నా బిడ్డ కాకుండా పోతాడా..? అని భార్యకు షాకిస్తాడు. నేటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Premalu OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రేమలు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు