Brahmamudi Serial: దుగ్గిరాల ఇంటి బాధ్యతలను కోడలికి అప్పగించిన అపర్ణ.. కావ్య ను దోషిగా నిలబెట్టాలని రుద్రానీ, అనామికల కుట్ర

అత్త అపర్ణ దుగ్గిరాల ఇంటి బాధ్యతలను కావ్యకు అప్పగిస్తుంది. దాంతో చిన్న కోడలు అనామిక, ధాన్యలక్ష్మీ షాకవుతారు. మరో వైపు కావ్య చేతిలో పెద్దరికం ఉండడం తట్టుకోలేని రుద్రానీ, అనామిక కావ్య పై కుట్రలు మొదలు పెడతారు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Brahmamudi Serial:  దుగ్గిరాల ఇంటి బాధ్యతలను కోడలికి అప్పగించిన అపర్ణ.. కావ్య ను దోషిగా నిలబెట్టాలని రుద్రానీ, అనామికల కుట్ర
New Update

Brahmamudi Serial: పెద్ద కోడలు అపర్ణాదేవి దుగ్గిరాల ఇంటి బాధ్యతలను కోడలు కావ్య చేతికి అప్పగిస్తుంది. ఇక నుంచి ఇంట్లో ఎవరికీ ఏదీ కావాల్సిన.. నువ్వు చూసుకోవాలని ఇంటి తాళాలను కావ్యకు ఇస్తుంది. అపర్ణ ఇలా చెప్పగానే ఇంట్లో అందరు సంతోషిస్తారు. కానీ చిన్న కోడలు, అనామిక, చిన్న అత్త ధాన్యలక్ష్మీ మాత్రం అసూయతో రగిలిపోతూ ఉంటారు.

publive-image

కావ్యకు దుగ్గిరాల ఇంటి బాధ్యతలను అప్పగించడం తట్టుకోలేకపోతున్న చిన్న కోడలు అనామిక అసూయను పెంచుకుంటుంది. ఇంట్లో తోడి కోడళ్ల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న రుద్రానీ.. ఇదే మంచి ఛాన్స్ అని అనామిక మనసులో మరింత విషం నింపే ప్రయత్నం చేస్తుంది. ఇద్దరు కలిసి కావ్యను అందరి ముందు దోషిని చేయడానికి కుట్ర చేయాలనీ ప్లాన్ చేస్తారు.

Also Read: Eagle Trailer: “దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను”.. ఆసక్తికరంగా ఈగల్ ట్రైలర్

publive-image

మరో వైపు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్న అప్పు.. తండ్రితో కలిసి ఏదైనా అకాడమీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒకరిని కలిసి తన పోలీస్ ట్రైనింగ్ గురించి తెలుసుకుంటుంది.

publive-image

కళ్యాణ్ ను ఎలాగైనా ఆఫీస్ కు పంపాలని నిర్ణయించుకున్న అనామిక.. భర్తతో మంచిగా నటిస్తూ ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. మనం సంతోషంగా ఉండాలంటే మీరు ఆఫీస్ కు వెళ్ళాలి భర్తను కోరుతుంది. అనామిక మాటలతో కళ్యాణ్ ఆఫీస్ కు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు.

publive-image

ఇటు కావ్య, రాజ్ ఇద్దరు ఆఫీస్ కు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంతలో శ్వేతా నుంచి రాజ్ కు కాల్ వస్తుంది. తన విడాకుల విషయం గురించి శ్వేత భర్తతో మాట్లాడాలని.. ఇంటికి రమ్మని చెబుతుంది. ఈ విషయం కావ్య వింటుందని గమనించిన రాజ్.. కావాలనే శ్వేతతో మరింత క్లోజ్ గా మాట్లాడుతూ.. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

publive-image

రాజ్ వెళ్ళగానే.. అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రూమ్ లోకి వచ్చిన రుద్రానీ కావ్యను మాటల్లో పెట్టి ఇంటి తాళాలను దొంగిలిస్తుంది. రాజ్ టెన్షన్ లో పడిపోయిన కావ్య.. ఇవేవి గమనించకుండ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

publive-image

ఇంటి తాళాలను దొంగలించిన రుద్రానీ అనామిక దగ్గరకు వచ్చి ప్లాన్ సక్సెస్ అని చెప్తుంది. ఈ దెబ్బతో కావ్య అందరి ముందు దోషిగా నిలబడుతుందని ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇంటి తాళాలను వదిలేసిన కావ్యను అత్త అపర్ణ ఏం చేయనుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.

publive-image

Also Read: Buchi Babu: రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో

#brahmamudi-serial-today-episode
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe