Brahmamudi Serial: భర్తకు చుక్కలు చూపిస్తున్న కావ్య.. అల్లాడిపోతున్న రాజ్..! బ్రహ్మముడి సీరియల్లో శ్వేతతో భర్త రాజ్ క్లోజ్‌గా ఉండటం చూసి కావ్య తట్టుకోలేకపోతుంది. రాజ్ పై సెటైర్లు వేస్తు అతడికి చుక్కలు చూపిస్తుంది. కావ్య ఎందుకు అలా మాట్లాడుతుందో తెలియక రాజ్ అల్లాడిపోతాడు. మరోవైపు అనామిక కళ్యాణ్ ను స్మార్ట్ గా తాయారుచేస్తుంది. ఇలా ఫన్నీగా సీరియల్ సాగుతుంది. By Jyoshna Sappogula 09 Jan 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Brahmamudi Serial Today Episode: భర్త రాజ్ తో శ్వేత క్లోజ్ గా ఉండటం కావ్య చూస్తుంది. వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుకుంటుంది. అయితే, భర్తను శ్వేత గురించి ఏమీ అడగలేకపోతుంది. రాజ్ ఆఫీస్ నుంచి రాగానే కోపంగా మాట్లాడుతూ..అతడిపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ ఉంటుంది. భార్య కావ్య ఎందుకు తనతో అలా మాట్లాడుతుందో అర్థం కాదు. రాజ్ పై కౌంటర్లు.. గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఒక్కసారిగా అతడి ముఖం ముందు కాఫీ కప్ పెడుతుంది హీరోయిన్ కావ్య. కాఫీ అని చెప్పి ఇవ్వొచ్చుగా అంటూ రాజ్ కామెంట్ చేయగా.. చెప్పకపోయినా కాఫీ.. కాఫీలానే ఉంటుంది.. టీలాగా ఉండదంటూ రాజ్ కు తిక్కతిక్కగా సమాధానమిస్తూ సెటైర్లు వేస్తుంది. ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఎత్తి పొడుస్తు రాజ్ కు చుక్కలు చూపిస్తుంది. కళ్యాణ్ ను కొత్తగా రెడీ చేసిన అనామిక ఇదిలా ఉండగా, అనామిక కళ్యాణ్ ను కొత్తగా రెడీ చేస్తుంది. ట్రెండ్ కు తగ్గట్టు డ్రెస్ట్ వేసి..స్మార్ట్ గా రెడీ చేస్తుంది. పాపం కళ్యాణ్ ఏమో సతమతమవుతుంటాడు. మరోవైపు కళ్యాణ్ జ్ఞాపకాల నుంచి బయటపడటానికి మళ్లీ పిజ్జా డెలివరీ ఉద్యోగంలో చేరుతుంది హీరోయిన్ చెల్లి అప్పు. కళ్యాణ్ ను మరిచిపోవాలంటే అప్పుకు పెళ్లి చేస్తేనే బాగుంటుందని పెద్దమ్మ అన్నపూర్ణమ్మ అంటుంది. అప్పుకు పెళ్లి..? ఇంట్లో అందరూ భోజనానికి కుర్చుంటారు. రోజు పప్పు తప్ప మరోటి చేయవా..రోజుకో వెరైటీ చేయోచ్చుగా అంటూ భార్య కావ్యతో అంటాడు రాజ్. బయటివాళ్లను పిలిచి వడ్డించమని చెప్పనా వెరైటీగా ఉంటుందని కావ్య కామెంట్ చేస్తుంది. బయట తిరుగుతున్నారుగా..కొత్త రుచులకు..కొత్త మనుషులకు అలవాటుపడ్డట్లున్నారు కదా అని అంటుంది. దీంతో, తన అత్త కావ్య మళ్లీ కావ్యకు క్లాస్ తీసుకుంటుంది. ఇలా సరదాగా ఫన్నీగా సాగుతుంది ఈరోజు ఎపిసోడ్. Also Read: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు మృతి.. #brahmamudi-serial మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి