Brahmamudi Serial: భార్య ముందే వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్న రాజ్.. తట్టుకోలేకపోతున్న కావ్య..!

మోడ్రన్ లుక్ లో కావ్యను చూసిన రాజ్ జెలసీగా ఫీల్ అవుతాడు. భార్యను ఏడిపించడానికి కావాలనే శ్వేతతో క్లోజ్ గా ఉంటాడు. శ్వేత, రాజ్ ను దగ్గరగా చూస్తూ తట్టుకోలేకపోతున్న కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇలా ఈరోజు బ్ర‌హ్మ‌ముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

Brahmamudi Serial: భార్య ముందే వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్న రాజ్.. తట్టుకోలేకపోతున్న కావ్య..!
New Update

Brahmamudi Serial: పాపను కిడ్నాప్ చేశారని తల్లి ద్వారా తెలుసుకున్న అప్పు. ఆ పాపను రౌడీల భారీ నుంచి కాపాడి వాళ్ళ అమ్మకు క్షేమంగా అప్పగిస్తుంది. ఆ చిన్నారిని కిడ్నాప్ చేసిన దొంగలను పోలీసులకు పట్టిస్తుంది. అప్పు చేసిన సహాయానికి పాప తల్లి కృతజ్ఞతలు చెబుతుంది.

publive-imageఇటు మాడ్రన్ లుక్ లో ఆఫీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కావ్యను చూసి ఫిదా అవుతాడు రాజ్. భార్యను ఆలా చూసి షాకైన రాజ్ చేతిలోని ఫైల్స్ కింద పడేస్తాడు. అక్కడే ఉన్న శృతి ఈరోజు ఇంకా అందంగా ఉన్నారు మేడం అంటూ కావ్యను పొగుడుతుంది. ఇది విన్న రాజ్ పని చేయడం రాదు కానీ.. మీ మేడం తో కబుర్లు మాత్రం చెప్తావు అని శ్రుతికి క్లాస్ ఇస్తాడు.

publive-image

రాజ్ ఫైల్స్ కింద పడేయడంతో.. ఏంటీ పడిపోయారా అంటూ డైలాగ్ వేస్తుంది కావ్య. ఇంతలో రాజ్ ఏంటీ అని అడిగేసరికి.. డిజైన్ పేప‌ర్స్ ప‌డేసుకుంటున్నారా అంటూ కవర్ చేస్తుంది కావ్య. కావ్య నచ్చినప్పటికీ బయటకు మాత్రం కోపంగా ఉన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. చాలా బాగున్నారు మేడం అంటూ కావ్యను అందరు పొగిడేస్తుంటే.. జలసీగా ఫీల్ అవుతాడు.

Also Read: This Week OTT Release: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు .. ఓటీటీ ప్రియులకు పండగే

publive-image

ఇది ఇలా ఉంటే రుద్రాణి, రాహుల్ ఇద్దరు కావ్య సడన్ గా ఆఫీస్ కు వెళ్లడం పై అనుమానం వ్యక్తం చేస్తారు. రాజ్, కావ్య ఇద్దరు అందరి ముందు అన్యూన్యంగా ఉన్నట్లు నటిస్తున్నారు . రాజ్ ఏదో తప్పు చేస్తున్నాడు.. అది తెలుసుకోవడానికే కావ్య రాజ్ వెంట ఆఫీస్ కు వెళ్తుంది అని డౌట్ పడతారు. అందేంటో మనం తెలుసుకోవాలని రుద్రాణి రాహుల్ తో కలిసి ప్లాన్ వేస్తుంది.

publive-image

ఇక రాజ్ కలవడానికి శ్వేత ఆఫీస్ కు వస్తుంది.క్యాబిన్ లో వీళ్లిద్దరు మాట్లాడుతుండగా అక్కడికి కావ్య రావడంతో.. కావాలనే కావ్య ముందు శ్వేతతో క్లోజ్ గా మాట్లాడుతూ, తనను హగ్ చేసుకుంటూ భార్యను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు రాజ్. ఇదే క్రమంలో శ్వేతా.. కావ్యను పరిచయం చేసుకుంటుంది. భర్త పై కోపంగా ఉన్న కావ్య శ్వేతతో వెటకారంగా మాట్లాడుతుంది.

publive-image

కావ్య అలా మాట్లాడడంతో శ్వేతకు అనుమానం వస్తుంది. కావ్య మనల్ని  అపార్థం చేసుకుంటుంది.. నేను ఇప్పుడే వెళ్లి మన మధ్య ఉన్నది స్నేహమేనని.. కావ్యకు నిజం చెప్పేస్తానని రాజ్ తో చెప్తుంది. నువ్వు కూడా నిజం దాచి తప్పు చేస్తున్నావని రాజ్ ను హెచ్చరిస్తుంది.

publive-imageదాంతో రాజ్.. కొంతమంది గొప్పగా ఆలోచించరు.. కళ్ళకు కనిపించిందే నిజమని నమ్ముతారు. ఇలాంటి వాళ్ళను సంస్క‌రించుకుంటూ కూర్చోలేము అంటూ శ్వేతకు బదులిస్తాడు . మన స్నేహం గురించి తెలియక కావ్య పొరపాటుపడుతుంది.. తాను నిల‌దీసిన‌ప్పుడే నిజం చెబితే బాగుండేది అని రాజ్ తో అంటుంది. ఇంతటితో ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

publive-imageAlso Read: Vishwambhara: 18 ఏళ్ల తర్వాత.. మెగాస్టార్‌తో మళ్లీ జత కట్టిన ఆ స్టార్ హీరోయిన్

#brahmamudi-serial-today-episode
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe