Brahmamudi Serial: కావ్యకు రాజ్ విడాకులు.. అనామిక టార్గెట్ ఇదే..! బ్రహ్మముడి సీరియల్ లో హీరో రాజ్ తన ఆఫీస్‌లో లాయర్‌తో విడాకుల గురించి మాట్లాడాడు. అయితే, విడాకులు కావ్యకు కాదు అని క్లియర్ గా అర్థమవుతుంది. మరోవైపు, అనామిక మంచిగా ఉంటూనే కావ్యను టార్గెట్ చేస్తూ ఇంట్లో అందరి ముందు అవమానిస్తూ ఉంటుంది. By Jyoshna Sappogula 08 Jan 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ లో హీరో రాజ్ తన ఆఫీస్‌లో లాయర్‌తో విడాకులు గురించి మాట్లాడం.. కావ్య ఏమో అసలు రాజ్ తో ఉన్న ఆమె ఎవరా? అనే సతమతమవడం.. మరోవైపు, అనామిక ఏమో కావ్యను టార్గెట్ చేస్తూ ఇంట్లో అందరి ముందు అవమానిస్తు ఉండడం..స్వప్న తన అత్తను టార్చర్ చేయడం.. ఇలా సీరియల్ కాస్తా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. విడాకులపై క్లారిటీ హీరో రాజ్ తన ఆఫీస్‌లో లాయర్‌తో విడాకులు గురించి మాట్లాడతాడు. అయితే, ఆ విడాకులు మాత్రం స్వేతకు సంబంధించినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే, లాయర్ తో స్టారింగ్ మాట్లాడే అప్పుడు రాజ్ ఇలా అంటాడు.. శ్వేత మీకు అన్ని విషాయాలు చెప్పింది..ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు అని అంటాడు. దీంతో, రాజ్ విడాకుల గురించి మాట్లాడింది శ్వేత కోసమే తప్ప..కావ్య గురించి కాదని క్లీయర్ గా అర్ధమవుతుంది. శ్వేత ఎవరూ? హీర్ రాజ్ శ్వేతతో చనువుగా ఉండడం చూసిన కావ్య తన భర్తతో ఉన్న ఆమె ఎవరా? అని సతమతమవుతుంటుంది. రాజ్ తో ఎందుకు అంత చనువుగా ఉంది? ఆమె ఎవరూ? ఎందుకు రాజ్ అబద్ధం చెప్పాడు అని తనలో తాను అనుకుంటుంది. ఇప్పటి వరకూ చూస్తే శ్వేత ఎవరు అనేది సీరియల్ లో క్లారిటీ ఇవ్వలేదు. అయితే, రాజ్ శ్వేతతో ఉండడం చూసి కూడా కావ్య రాజ్ ను ఏమీ ప్రశ్నించదు. భర్తకు క్యారెర్ ఇచ్చి ఆటోలో వెళ్తుండగా అప్పు ఎదురవుతుంది. తనతో పాటు ఇంటికి వెళుతుంది. అక్కడ కాసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇంటికి వెళుతుంది. కావ్యను టార్గెట్ చేసిన అనామిక ఇదిలా ఉండగా, అనామిక ఏమో కావ్యను ఇంట్లో బ్యాడ్ చేయాలని అందరిని తనవైపు తిప్పుకోవాలని ట్రై చేస్తు ఉంటుంది. రుద్రాణి.. అనామికను కావ్యపై ఊసుగొలుపుతూ తనను రెచ్చగొట్టేలా చేస్తుంది. కావ్య మార్నింగ్ వెళ్లి వచ్చే సరికి లేట్ అవుతుంది. దీంతో కావ్య ఇంట్లోకి వచ్చి తన రూమ్ లోకి వెళుతుంటే తన అత్త అడ్డుకుంటుంది. మార్నింగ్ వెళ్లి ఇప్పుడా వచ్చేది అని ప్రశ్నిస్తుంది. చెల్లి అప్పు కలిసింటే ఇంటికి వెళ్లి వస్తున్న అంటూ సమాధానం చెబుతుంది. చిన్న అత్త కూడా కావ్య తన పుట్టింటికి వెళ్లినందుకు తిడుతుంది. అయితే, కావ్య మాత్రం అది నా పుట్టినిల్లు..అక్కడ ఉన్నది నన్ను కన్న తల్లిదండ్రులు అంటూ ఆన్సర్ చేస్తుంది. కావ్యకు అండగా నిలబడిన స్వప్న అందరిని తిట్టిపడేస్తుంది. Also Read: ‘హిందీ రుద్దుడు..’ రిపోర్టర్‌పై హీరో విజయ్ సేతుపతి ఆగ్రహం! #brahmamudi-serial మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి