Andhra Pradesh: బందరులో బీపీసీఎల్‌ రిఫైనరీ..రూ. 60 వేల కోట్లతో ఏర్పాటు!

ఏపీకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ చెప్పింది కేంద్రం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురితో సమావేశం అయ్యారు. మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో భారత్ పెట్రోలియం (బీపీసీఎల్‌) రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు

New Update
Andhra Pradesh: బందరులో బీపీసీఎల్‌ రిఫైనరీ..రూ. 60 వేల కోట్లతో ఏర్పాటు!

Machilipatnam: ఏపీకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ చెప్పింది కేంద్రం...రాష్ట్రంలో ఏర్పాటు కానున్న రిఫైనరీపై ఓ స్పష్టత ఇచ్చింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu Naidu) కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురితో సమావేశం అయ్యారు. మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో భారత్ పెట్రోలియం (బీపీసీఎల్‌) రిఫైనరీ (BPCL Refinery) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు రిఫైనరీ ఏర్పాటుచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. నాలుగేళ్లలో రిఫైనరీ పూర్తవుతుందని.. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.

బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటు కోసం సుమారు 2-3 వేల ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి (Hardeep Singh Puri) సూచించారు. ఈ భూమి మచిలీపట్నంలో అందుబాటులో ఉందని.. ఒకవేళ ఇంకా భూమి కావాలన్నా ఇస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.

భూమి విషయంలో కేంద్రమంత్రి పురి, చంద్రబాబు సానుకూలంగా ఉన్నారు. అలాగే బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటుకు మచిలీపట్నం అయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని.. అలాగే రాజధాని అమరావతికి సైతం దగ్గరగా ఉంటుందని.. మచిలీపట్నం పోర్టు కూడా అందుబాటులో ఉంటుంది అన్నారు. మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటుతో ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. స్థానికులు, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు.

Also Read: విద్యుత్‌ బిల్లుల చెల్లింపులో క్యూ ఆర్‌ కోడ్‌ విధానం!

Advertisment
తాజా కథనాలు