Accident : పెద్ద కొడుకుని రక్షించబోయి.. చిన్న కొడుకుని చేజార్చుకున్నాడు! ఎస్కలేటర్ మీద నుంచి జారి పోతున్న పెద్ద కుమారుడ్ని పట్టుకునే క్రమంలో చిన్న కుమారుడ్ని చేతుల్లో నుంచి చేజార్చుకున్నాడు ఓ తండ్రి. ఈ విషాదకర ఘటన ఛత్తీస్ ఘడ్ లోని రాయ్‌పూర్ లో సిటీ సెంట్రల్ మాల్ లో చోటు చేసుకుంది. By Bhavana 21 Mar 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి Boy Slips From Fathers Arms : పిల్లల(Kids) తో కలిసి సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లిన ఆ ఫ్యామిలీలో తీవ్ర విషాదం(Terrible Tragedy) నెలకొంది. సంవత్సరం వయసున్న బాబు కన్న తండ్రి చేతుల్లో నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ బాబు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దారుణానికి సంబంధించిన ఘటన సీసీ కెమెరా(CC Camera) ల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది. ఈ ఘటన చూసేవారికి కన్నీళ్లు పెట్టిస్తుంది. వివరాల ప్రకారం.. ఛత్తీస్ ఘడ్ లోని రాయ్‌పూర్ లో సిటీ సెంట్రల్ మాల్ లో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. Toddler at Raipur mall dies after falling from the third floor after he accidentally slips from the lap of the guardian, while he looked after another child.#Raipur pic.twitter.com/BfLuRfa8Ki — Vani Mehrotra (@vani_mehrotra) March 20, 2024 ఇద్దరు పిల్లలతో కలిసి ఓ జంట షాపింగ్(Shopping) కోసం వచ్చారు. భార్య పిల్లలతో కలిసి భర్త బయట నిల్చున్నాడు. పిల్లలతో కలిసి భర్త బయట నిల్చున్నాడు. పిల్లల్లో ఒకరికి ఐదేళ్లు ఉండగా, మరొకరు ఏడాది వయసున్న మరో చిన్నారి. ఇంతలో ఎస్కలేటర్ ఎక్కేందుకు పెద్ద కొడుకు మారాం చేయడం, వద్దంటూ తండ్రి కట్టడి చేయడం కనిపించింది. ఈ క్రమంలో భుజానికి ఎత్తుకున్న చిన్న కొడుకు జారి కిందపడ్డాడు. పై ఫ్లోర్ నుంచి కింద పడడంతో బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటికే బాబు ప్రాణం కోల్పొయిందని వైద్యులు తెలిపారు. తన చేతుల్లో నుంచి కొడుకు జారి పడి ప్రాణాలు పొగొట్టుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. Also Read : జక్కన్న కు తప్పిన పెను ప్రమాదం! #mall #boy-slips-from-fathers-arms #escalator-tragedy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి