దశాబ్ది ఉత్సవాల్లో అపశృతి.. విద్యార్థి బలి, ఆగ్రహించిన గ్రామస్థులు!

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం, మరిపెళ్లి గూడెంలో అపశృతి నెలకొంది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఓ విద్యార్థి బలయ్యాడు. కిరాణం దుకాణంలోకి వెళ్లి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకునేందుకు వెళ్తుండగా.. వీధికుక్కలు వెంటపడటంతో వీటిని తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ వైపుగా పరుగెత్తడంతో దాని కింద పడి మృత్యువాత పడ్డాడు.

Crime News: దారుణం.. మొదటి భార్య కోసం రెండో భార్యను చంపిన భర్త.!
New Update

boy- killed- in- tractor- in- hanamkonda-vidyapandaga-kamalapur-maripelligudem

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం, మరిపెళ్లి గూడెంలో అపశృతి నెలకొంది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఓ విద్యార్థి బలయ్యాడు. ఇక అసలు వివరాల్లోకి వెళితే... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యా పండుగా సందర్భంగా ర్యాలీ తీస్తున్న ట్రాక్టర్ కింద పడి ఇనుగాల ధనుష్ (10) అనే 6వ తరగతి చదువుతున్న విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కిరాణం దుకాణంలోకి వెళ్లి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకునేందుకు వెళ్తుండగా.. వీధికుక్కలు వెంటపడటంతో వీటిని తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ వైపుగా పరుగెత్తడంతో దాని కింద పడి మృత్యువాత పడ్డాడు.

  • తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఓ విద్యార్థి బలి
  • 6వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి
  • బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకునేందుకు వెళ్తుండగా ఘటన
  • కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
  • అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం

ఇక... మృతిచెందిన విద్యార్థి స్ధానిక ప్రాథమిక పాఠశాలలో 5 వ తరగతి పూర్తి చేసి ఈ విద్యా సంవత్సరం 6 వ తరగతిలో ప్రవేశం కోసం హైస్కూల్ కు వెళ్లిన ధనుష్.. అయితే తమ చేతికి అంది వచ్చే సమయానికి తన కన్న కొడుకు ఇలా కళ్లముందే చనిపోతాడని అనుకోలేదని బాలుడి తల్లిదండ్రులు జయపాల్, స్వప్న కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యమే విద్యార్ధి ప్రాణం తీసిందని, పాఠశాల నిర్వాహకులు అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe