Nikhat Zareen : బాక్సింగ్‌ కే జీవితం అంకితమిచ్చా.. ఓటమి తట్టుకోలేకపోతున్నాను!

ఒలింపిక్స్ లో పతకం కచ్చితంగా సాధిస్తుందనుకున్నతెలంగాణ క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ ఊహించని రీతిలో మొదటి రౌండ్‌ లోనే వెనుదిరిగింది.ఈ క్రమంలో ఆమె తన బాధను ఎక్స్ ద్వారా పంచుకుంది. జీవితం మొత్తాన్ని బాక్సింగ్‌ కే కేటాయించాను. ఈ ఓటమి ఫలితాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందంటూ రాసుకొచ్చింది.

New Update
Nikhat Zareen : బాక్సింగ్‌ కే జీవితం అంకితమిచ్చా.. ఓటమి తట్టుకోలేకపోతున్నాను!

Nikhat Zareen Emotional Post : పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) లో పక్కా పతకం సాధిస్తుందనుకున్న స్టార్‌ బాక్సర్‌ , తెలంగాణ (Telangana) యువతి నిఖత్‌ జరిన్‌ ఖాళీ చేతులతోనే రాష్ట్రానికి తిరిగి వచ్చింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన నిఖత్‌ (Nikhat Zareen) ఒలింపిక్‌ మహాసంగ్రామంలో తన పంచ్‌ పవర్‌ చూపించలేకపోయింది. ఊహించని రీతిలో తొలిరౌండ్ లోనే ఇంటి ముఖం పట్టింది. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ గెలిచిన ఇందూరు ముద్దు బిడ్డ ఒలింపిక్‌ పతకాన్ని ముద్దాడలేకపోయింది.

పారిస్‌లో ఒలింపిక్స్‌ ముగిసిన మ‌రునాడే ఈ యువ బాక్స‌ర్ త‌న బాధ‌ను ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా చెప్పింది. '' జీవితం మొత్తాన్ని బాక్సింగ్‌ (Boxing) కే కేటాయించాను. ఒలింపిక్స్‌ లో ఓటమి ఫలితాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఛాంపియన్‌ గా నిలిచిన నా ప్రత్యర్థి వూ యూ కి అభినందనలు. ఇప్పుడు నా జీవిత ప్రయాణాన్ని అంగీకరించడం చాలా కష్టంగా ఉంది. విజయాలు, ఓటములు, తప్పులు, అయోమయ పరిస్థితులు....ఇవన్నీ కూడా జీవితంలో ఓ భాగమే.

ఒకే ల‌క్ష్యం కోసం జీవితం మొత్తాన్ని అంకితం చేశాక ఫ‌లితాన్ని అంగీక‌రించ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది. ఈ స‌మ‌యంలో నేనొక విష‌యం నేర్చుకున్నా. జీవిత‌మ‌నేది ఊహ‌కంద‌నిది. ఇది మ‌న ఎదుగుద‌ల‌తో ఓ భాగం. అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఒకేసారి స‌మాధానాలు లేక‌పోవడం కూడా మంచిదే. ఒక‌వేళ నేను నిన్న చాలా సంతోషంగా ఉండి ఉంటే.. ఈరోజు నేను ఓడిపోయినా పెద్ద‌గా బాధ‌ప‌డ‌ను. ఎందుకంటే నేను కూడా మ‌నిషినే. నేను అనుకున్న విధంగా అన్ని జ‌ర‌గ‌వు అనే స‌త్యాన్ని న‌మ్మడం అల‌వాటు చేసుకుంటున్నా.

ఆ దేవుడు అనుకున్న‌ట్టే అన్నీ అవుతాయి. ఎందుకంటే ఆయ‌నే క‌దా బెస్ట్ ప్లాన‌ర్. ఇప్ప‌టికైతే నేను జీవిత ప్ర‌యాణాన్ని ఆస్వాదిస్తా. వ‌చ్చే ఒలింపిక్స్ మీద దృష్టి పెడుతా అని నిఖ‌త్ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చింది. నిజామాబాద్‌కు చెందిన నిఖ‌త్ 50 కిలోల విభాగంలో ఒలింపిక్స్ బ‌రిలోకి దిగింది. ఒలింపిక్ ట్ర‌య‌ల్స్‌లో దిగ్గ‌జ బాక్స‌ర్ మేరీ కోమ్‌ను ఓడించిన ఆమె ఈసారి ప‌త‌కం గెల‌వ‌డం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ, అంచ‌నాలు తలకిందులు అయ్యాయి. తొలి రౌండ్‌లోనే ఆమెకు చైనా బాక్స‌ర్ వూ యూ నిఖత్‌ కు చెక్ పెట్టింది. దాంతో.. 50 కిలోల‌ నిర్ణీత బ‌రువు ఉండేందుకు నిఖ‌త్ రెండు రోజులుగా ప‌డ్డ శ్ర‌మ అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది.

Also read: ఏపీలో తెలంగాణ ఉద్యోగుల రిలీవ్

#paris-olympics-2024 #nikhat-zareen #boxing #telangana
Advertisment
తాజా కథనాలు