లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ రోజు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో సభలో గందర గోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సభను మొదట 12 గంటల వరకు వాయిదా వేశారు.
అనంతరం 12 గంటల తర్వాత సభ పున: ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో సభను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక సభను స్పీకర్ ఓం బిర్లా రేపటికి వాయిదా వేశారు.
అంతకు ముందు విపక్షాల ఆందోళనల నడుమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో మాట్లాడారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా వుందని ఆయన ప్రకటించారు. మణిపూర్ అంశంలో వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో విపక్ష సభ్యులు సహకరించాలని అమిత్ షా కోరారు. కానీ విపక్ష సభ్యులు తమ ఆందోళన
మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. రూల్ 267 ప్రకారం తామంతా నోటీసులు ఇచ్చామని, మణిపూర్ అంశంపై చర్చకు అనుమతించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. మరో వైపు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్ లోకి దూసుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన్ని సమావేశాలు ముగిసే వరకు రాజ్య సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు.