Bontu Rammohan : మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ టికెట్.. పార్టీ మార్పుపై బొంతు రామ్మోహన్ సంచలన ప్రకటన!

బీఆర్ఎస్ పార్టీ మార్పుపై బొంతు రామ్మోహన్ సంచలన ప్రకటన చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను ఏపార్టీలోనూ జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకోలేదన్నారు. మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

New Update
Bontu Rammohan :  మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ టికెట్.. పార్టీ మార్పుపై బొంతు రామ్మోహన్ సంచలన ప్రకటన!

Bontu Rammohan :  బీఆర్ఎస్ పార్టీ  మార్పుపై మాజీ మేయర్,బీఆర్ఎస్ నాయకుడు బొంతు రామ్మోహన్ సంచలన ప్రకటన చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను ఏపార్టీలోనూ జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకోలేదన్నారు. మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రామ్మోహన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మల్కాజ్ గిరి (లేదా) సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల నుండి పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నాను. ఇదే విషయం పార్టీ అధిష్టానానికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒకే కుటుంబం వారికి అవకాశం ఇవ్వకుండా ఉద్యమకారులకు, పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వారికి అవకాశం ఇవ్వాలని సూచించాను. నేను హైదరాబాద్ మేయర్ గా నగర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పని చేశాను. పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు , పార్టీ ఇతర పెద్దల పై నాకు విశ్వాసం ఉంది. నా అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తారనే నమ్మకం ఉంది.

నేను పార్టీ మారుతున్నట్లు కొన్ని చానల్స్ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకోలేదని రామ్మోహన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: రైతులకు అదిరిపోయే వార్త…బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు