Pakistan Bomb Blast : పాకిస్థాన్ (Pakistan) లోని బలూచిస్థాన్‌లోని పిషిన్ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన పేలుడులో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరు పోలీసులతో సహా 13 మంది గాయపడ్డారు. సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్లో ఈ ఘటన జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా – బలూచిస్థాన్‌లలో పోలీసు అధికారులు అలాగే సెక్యూరిటీ పోస్టులపై నిరంతర దాడుల సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) 2022లో ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన తర్వాత దాడులు పెరిగాయి.
పూర్తిగా చదవండి..Pakistan : పాకిస్తాన్ లో బాంబు పేలుడు.. ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురి మృతి!
పాకిస్తాన్ లో బాంబు పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పిషిన్ సివిల్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అర్బాబ్ కమ్రాన్ అందించిన వివరాల ప్రకారం మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిలో 13 మందిని క్వెట్టా ట్రామా సెంటర్‌కు పంపారు.
Translate this News: