Tabu : ఆ ప్రశ్న హీరోలను ఎందుకు అడగరు? దమ్ముంటే వాళ్ళను అడగండి.. రిపోర్టర్ పై ఫైర్ అయిన టబు..!

హీరోయిన్ టబు ఇటీవల ‘ఔర్‌ మే కహా దమ్‌ థా' మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఇందులో ఓ రిపోర్ట‌ర్ ఈ సినిమాకు మీ రెమ్యూనరేషన్ ఎంతని అడగ్గా.. దీంతో అసహనానికి లోనైన ఆమె.. హీరోలకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నవారి దగ్గరకు వెళ్లి ఈ ప్రశ్నలు అడగండి అని ఫైర్‌ అయ్యారు.

New Update
Tabu : ఆ ప్రశ్న హీరోలను ఎందుకు అడగరు? దమ్ముంటే వాళ్ళను అడగండి.. రిపోర్టర్ పై ఫైర్ అయిన టబు..!

Bollywood Actress Tabu : బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌, సీనియర్ హీరోయిన్ టబు జంటగా నటించిన తాజా చిత్రం ‘ఔర్‌ మే కహా దమ్‌ థా'. నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 2 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ రిపోర్ట‌ర్ ఈ సినిమాకు మీ రెమ్యూనరేషన్ ఎంత అని అడగ్గా.. దీంతో అసహనానికి లోనైన ఆమె.. హీరోలకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నవారి దగ్గరకు వెళ్లి ఈ ప్రశ్నలు అడగండి అని ఫైర్‌ అయింది.

'హీరోహీరోయిన్లకు పారితోషికం దగ్గర ఎందుకు వ్యత్యాసం చూపిస్తారని ప్రతి నటిని పట్టుకుని అడుగుతారు. పైగా మగవారికే ఎక్కువ డబ్బు ఇస్తారని, వారికంటే మాకు తక్కువే ముడుతుందని మీకూ తెలుసు.అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకని ఆ ప్రశ్నలు అడుగుతారు? వెళ్లి ఆ పారితోషికం ఇచ్చేవారినే అడగండి.

Also Read : ‘కంగువా’ తో పోటీ పడే ధైర్యం ఎవ్వరికీ లేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

దీనికి నేనెలా సమాధానం చెప్తాను. హీరోల కన్నా తక్కువ పారితోషికం ఇవ్వడం నచ్చడం లేదనో లేదా ఇచ్చినదానితోనే సర్దుకుపోతున్నానో చెప్తే దాన్ని సెన్సేషనల్‌ చేయాలనే కదా మీ తాపత్రయం. మీకు ఎందుకు ఎక్కువ ఇస్తున్నారని వెళ్లి హీరోలను అడండి. అప్పుడు ఏం సమాధానాలు వస్తాయో చూద్దాం" అంటూ చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు