Sonakshi Sinha Wedding: బాలీవుడ్ సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. నేడు జూన్ 23న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే హల్దీ, మెహందీ, వేడుకలు పూర్తి చేసుకున్న ఈ జంట ఈరోజు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు.
సోనాక్షి వెడ్డింగ్ కాస్ట్యూమ్స్
అయితే తాజాగా తాజాగా సోనాక్షి పెళ్లి కోసం డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి కోసం ప్రత్యకంగా డిజైన్ చేసిన ఈ దుస్తువులను నిన్న సాయంత్రం ఆమె ఇంటికి డెలివరీ చేశారు. పింక్ కలర్‌లో అనార్కలి స్టైల్ లాంగ్ సూట్, లైట్ ఆరెంజ్ లాంగ్ ఫ్రాక్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఈ దుస్తువులను సోనాక్షి వివాహ వేడుకకు ధరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. పెళ్లి తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం గ్రాండ్ రెసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ గ్రాండ్ రిసెప్షన్‌లో ప్రముఖ బాలీవుడ్ సెలెబ్రెటీలు హాజరుకానున్నారు.