Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' పై బాలీవుడ్ నటుడు ఫైర్.. మహాభారతాన్ని వక్రీకరించారంటూ!

బాలీవుడ్‌ నటుడు ముకేశ్ ఖన్నా 'కల్కి' సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు మేకర్స్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. మహాభారతాన్ని వక్రీకరించారని, కొన్ని సీన్స్ లో పురాణ ఇతిహాసాన్ని మార్చేందుకు యత్నించారని ఆరోపించారు.

Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' పై బాలీవుడ్ నటుడు ఫైర్.. మహాభారతాన్ని వక్రీకరించారంటూ!
New Update

Bollywood Actor Mukesh Khanna Fires On Kalki Makers : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ ఫిక్షనల్ మూవీ ‘కల్కి 2898AD’ ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు రూ.700కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో త్వరలోనే ఈసినిమ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమాపై ఓ బాలీవుడ్ నటుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కల్కి లో మహాభారతాన్ని మార్చేందుకు మేకర్స్ ప్రయత్నించారని మూవీ టీమ్ ను తప్పు పట్టాడు.

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ముకేశ్ ఖన్నా తాజాగా కల్కి మూవీని వీక్షించాడు. ఈ క్రమంలోనే తన యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా రివ్యూను వెల్లడించారు. ఆ రివ్యూలో ముకేశ్ మాట్లాడుతూ.." నన్ను బాధిస్తున్న ఒక విషయం ఏమిటంటే.. కల్కి మేకర్స్ ఈ చిత్రంలో మహాభారతాన్ని మార్చడానికి ప్రయత్నించారు. ఈ చిత్రం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామను వేడుకున్నట్లు చూపించారు. అశ్వత్థామ మణిని శ్రీకృష్ణుడు తొలగించడం.. భవిష్యత్తులో నువ్వే నా రక్షకుడివని అతన్ని శ్రీకృష్ణుడు వేడుకోవడం లాంటి సీన్స్‌ ఉన్నాయి.

Also Read : అమెరికా వెళ్ళాలి.. ఎవరైనా సాయం చేయండి – వైరల్ అవుతున్న మంచు లక్ష్మి పోస్ట్!

కానీ శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎప్పుడూ అలా చెప్పలేదు. ఈ విషయంపై నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా. మీకు వ్యాసముని కంటే ఎక్కువ తెలుసునని ఎలా ఊహించుకున్నారు. నేను నా చిన్నప్పటినుంచి మహభారతం చదువుతున్నా. అశ్వత్థామ 'మణి'ని తొలగించింది శ్రీ కృష్ణుడు కాదు. ఈ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు క్షమించరానివి" అని పేర్కొన్నాడు.

#kalki-2998-ad #bollywood-actor-mukesh-khanna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe