Bollywood Actor Adil Hussain Shocking Comments On Animal Movie :గత ఏడాది పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'యానిమల్' మూవీపై ఏ రేంజ్ లో విమర్శలొచ్చాయో తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ యాక్టర్స్, సినీ క్రిటిక్స్ ఈ సినిమాని ఉద్దేశిస్తూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ఫైర్ అయ్యారు. దానికి సందీప్ వంగా సైతం సందర్భం వచ్చిన ప్రతిసారీ కౌంటర్లు వేస్తూనే వచ్చాడు.
ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'కబీర్ సింగ్' మూవీలో నటించిన బాలీవుడ్ నటుడు అదిల్ హుస్సేన్ సినిమాలో తన పాత్ర బానే ఉందని, కానీ రిలీజ్ తర్వాత సినిమా చూశాకే సిగ్గుతో తల దించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. దీనికి సందీప్ రెడ్డి 30 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ బ్లాక్‌బస్టర్ మూవీతో వచ్చిందని కౌంటర్ ఇచ్చాడు.
Also Read : ‘పుష్ప 2’ రిలీజ్ మరోసారి వాయిదా.. కారణం అదే!
ఫేమస్ అనుకుంటున్నాడా?
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదిల్ సందీప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.." ఆయనేమైనా తైవాన్ డైరెక్టర్ ఆంగ్ లీ కన్నా ఫేమస్ అనుకుంటున్నాడా? ఆయన అంతలా ఊహించుకుంటే నేనేం చేయలేను. కబీర్ సింగ్ కలెక్షన్స్ నాకంతగా తెలీదు కానీ, ఆంగ్ లీ తెరకెక్కించిన లైఫ్ ఆఫ్ పై మూవీ దాదాపు 5 వేల కోట్లపైన రాబట్టింది. ఈ లెక్కల్ని ఆయన సాధిస్తాడని నేననుకోవడం లేదు. యానిమల్ సినిమాలో ఏదైనా పాత్ర ఆఫర్ చేస్తే చేసేవారా? అన్న ప్రశ్నకు.. లేదని బదులిచ్చాడు. 200 కోట్లు ఇచ్చినా చేసేవాడినే కాదు. అలాంటివి ఎప్పటికీ చేయను" అని అన్నాడు. మరి దీనిపై సందీప్ రెడ్డి వంగ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Adil Hussain : 200 కోట్లు ఇచ్చినా 'యానిమల్' లో నటించేవాడ్ని కాదు.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటుడు అదిల్ హుస్సేన్ 'యానిమల్' మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన్ని 'యానిమల్' సినిమాలో ఏదైనా పాత్ర ఆఫర్ చేస్తే చేసేవారా? అని అడిగితే, లేదని బదులిచ్చాడు. ' 200 కోట్లు ఇచ్చినా చేసేవాడినే కాదు. అలాంటివి ఎప్పటికీ చేయను' అని అన్నాడు.