Rangareddy Fire Accident: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్(Shadnagar) నియోజకవర్గం పరిధిలోని కొందుర్గు మండల కేంద్రంలో గల స్కాన్ ఐరన్ పరిశ్రమలోని(Iron Factory) భట్టిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్ర శివారులోని స్కాన్ ఐరన్ పరిశ్రమలో మంగళవారం ఐరన్ లారీల లోడ్లు అన్‌లోడింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో భట్టిలో పేలు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భారీ శబ్ధాలు వచ్చాయి. దాంతో స్థానికులు హడలిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు కొందరు పరిస్థితిని గమనించి.. బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ పేలుడు ధాటికి పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ ఘటనలో రెండు లారీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇతర సామాన్లు కూడా దగ్ధమైయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పేలుడు కారణంగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను షాద్ నగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. కాగా, ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫైర్ శాఖ అధికారులు.. విచారణ చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్ భారీ వర్షం..
మరోవైపు హైదరాబాద్ నగరం వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాని ప్రజలు అల్లాడిపోయారు. రోడ్లపై భారీ వరద ప్రవహించడంతో జనాలు తీవ్ర అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ జామ్ గురించి అయితే ఇక చెప్పనవసరం లేదు. రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
నాలాలో కొట్టుకుపోయిన నాలుగేళ్ల బాలుడు..
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలు ఓ పిల్లాడి ప్రాణాలు తీశాయి. నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు కొట్టుకుపోయాడు. పక్కనే అతని తాతయ్య ఉన్నా.. కాలు జారి అందులో పడిపోవడంతో బాలుడు గల్లంతయ్యాడు.
Also read:
IT Notice to Chandrababu: ఐటీ నోటీసుల వ్యవహారంలో చంద్రబాబుకు షాక్.. రంగంలోకి సీఐడీ..!
Balagam Movie: ‘బలగం’ సినిమా నటుడు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డైరెక్టర్ వేణు..