నిత్యం హైదరాబాద్ నగరంలో ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలను తీసుకొచ్చిన వాహనదారులు మాత్రం వారి పని వారు చేసుకుంటున్నారు. అంతేకాదు.. వారితో పాటుగా ఎదుటివారికి కూడా హానిని కలిగిస్తున్నారు. అలాంటిదే తాజాగా.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మరో కారు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి బంజారాహిల్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఒకటి.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియోను ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం రిలీజ్ చేశారు. ఫుల్లుగా తాగిన ఓ మహిళా ఆ కారును నడుపుతున్నట్లు వీడియోలో రుజువైంది.
రాంగ్‌రూట్లో వచ్చి జీహెచ్ఎంసీ ఉద్యోగిని ఢీకొట్టిన కారు
జీహెచ్ఎంసీ ఉద్యోగి బాలా చందర్ యాదవ్ స్కూటీపై వెళ్తుండగా.. రాంగ్‌రూట్లో అతడికి ఎదురుగా అతివేగంతో బీఎండబ్ల్యూ కారు దూసుకువచ్చింది. అయితే కారు వేగాన్ని చూసి ఆ వ్యక్తి భయంతో అప్పటికే తన స్కూటీని ఆపేశాడు. కానీ కారు డ్రైవర్ మాత్రం వేగంగానే వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఉద్యోగికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదానికి కారణమైన నిందితులు ఎవరైనా సరే వారికి కఠిన శిక్షను విధించాలని అలాగే గాయపడ్డ జీహెచ్‌ఎంసీ ఉద్యోగికి న్యాయం చేయాలని జీహెచ్‌ఎంసీ సిబ్బంది కోరుతున్నారు. ఈ ప్రమాదానికి ముఖ్యకారణం.. మద్యం ఫుల్‌గా తాగి కారుని అతివేగంగా నడపడం వల్లనే అని తెలుస్తోంది.
పోలీసులు ఉక్కుపాదం మోపాలని కోరిన నగరవాసులు
అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం వాహనదారులకు బ్రేక్‌లు వేసేలా మరికొన్ని కొత్త చట్టాలు తీసుకురావాలని నెటిజన్లు కోరుతున్నారు. కోరడమే కాదు మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాహనదారులపై కఠిన నిబంధనలను తీసుకురావాలని, రాత్రి సమయాల్లో అయితే కారులు తమ లిమిట్ దాటి ర్యాష్ స్పీడ్‌తో డ్రైవ్ చేయడం, రోడ్లపై చెక్కర్లు కొడుతూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని కోరుతున్నారు. ఇలాంటి వాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని నగరవాసులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే..రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ వద్ద యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. వేగంగా వచ్చిన వాహనం అదుపు తప్పి మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపై దూసుకువెళ్లింది. ఆ ఘటనలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో కారు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.